హవ్వ! ఈ సినిమాను యూ ట్యూబ్‌లో చూస్తారా? ప్రతి ఇంట్లో ఉండాల్సిన డి.వి.డి కదా ఇది. పిల్లలకు ఎనిమిదేళ్లు నిండగానే ప్రతి నెలా మొదటి ఆదివారం వాళ్లకేం కావాలో కొనిచ్చి మిస్సమ్మను చూపించాలి.
అండ్ లిటరేచర్: హవ్వ! ఈ సినిమాను యూ ట్యూబ్‌లో చూస్తారా? ప్రతి ఇంట్లో ఉండాల్సిన డి.వి.డి కదా ఇది. పిల్లలకు ఎనిమిదేళ్లు నిండగానే ప్రతి నెలా మొదటి ఆదివారం వాళ్లకేం కావాలో కొనిచ్చి మిస్సమ్మను చూపించాలి. అప్పుడే సరిగ్గా తెలుగులో పెంచినట్టు. మిస్సమ్మ 1956లో వచ్చింది. కాని ఇప్పటికీ అప్పుడే కోసుకొచ్చిన ఆకుకూరలా తాజాగా ఉంటుంది. ఎవరు ఏది కావాలంటే అది వేసి వొండుకుని రుచిని ఆస్వాదించవచ్చు. జ్యోతిష్ బెనర్జీ రాసిన బెంగాలీ హాస్యనవల ‘మన్‌మోయీ గర్ల్స్ స్కూల్’ దీనికి మూలం. దీనిని చక్రపాణి తెలుగులోకి ‘ఉదరపోషణార్థం’ పేరుతో అనువదించి పనిలో పనిగా సినిమాగా బాగుంటుందని ‘మిస్సమ్మ’ స్క్రిప్ట్‌గా అడాప్ట్ చేశారు.
కాని ఆ పాయింట్ ఒక్కటే సినిమాకు సరిపోకపోవడంతో తాను అనువదించిన ‘డిటెక్టివ్’ అనే మరో బెంగాలి నవలలోని పాయింట్‌ను తీసుకొని దీనికి జత చేశారు. ఆ తర్వాతేముంది? ఇప్పటివరకూ వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోంచి లెక్క తీసినా టాప్ టెన్‌లో ఇది తప్పదు. ఇందులో జనానికి నచ్చేదేమిటి? కులాలు మతాలు అనే గొడవ పట్టించుకోకుండా హాయిగా నవ్వుతూ తుళ్లుతూ ఉల్లాసంగా బతకండిరా అనడమే. ఒక ఉల్లాసవంతమైన తెలుగు సినిమా అంటే మిస్సమ్మను మించింది లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్... ఇంకో హీరో సావిత్రి... ఇంకో హీరో సాలూరి... ఇంకో హీరో పింగళి... ఇంకో హీరో ఎల్.వి. ప్రసాద్. ఆ రోజులే వేరూ... ఆ బంగారమూ వేరే. ఈ ముత్తూట్ రోజుల్లో మిగిలింది మిస్సమ్మను చూసి ఆనందించడమే కదా. ఈ సండే దీనికే కేటాయించండి.