వదంతులు సృష్టించిన వ్యక్తిపై గూండా యాక్ట్‌  | Food Poison: Naam Tamilar Party Leader Murugan Arrested For Fake Trolling On Youtube | Sakshi
Sakshi News home page

వదంతులు సృష్టించిన వ్యక్తిపై గూండా యాక్ట్‌ 

Published Tue, Jan 4 2022 7:41 AM | Last Updated on Tue, Jan 4 2022 7:41 AM

Food Poison: Naam Tamilar Party Leader Murugan Arrested For Fake Trolling On Youtube - Sakshi

అరెస్టయిన సాటై మురుగన్‌

సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్‌ మీడియాలో వదంతులు సృష్టించిన నామ్‌తమిళర్‌ పార్టీ నేత, ప్రముఖ యూటూబ్‌ చానల్‌ నిర్వాహకుడు సాటైమురుగన్‌పై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ మేరకు అతడిపై గుండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌ సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు 2 వేల మంది యువతులను తిరువళ్లూరులో ఉంచి షిప్ట్‌ పద్ధతిలో పనిచేయిస్తున్నారు.

మూడు వారాల క్రితం కార్మికులకు పెట్టిన భోజనం కలుషితం కావడంతో వందలాది మంది అస్వస్థతకు గురై ప్రైవేటు వైద్యశాలలో చేరా రు. ఈ సమయంలో సీమాన్‌ పార్టీ నేత, యూటూబ్‌ చానల్‌ నిర్వాహకుడు సాటై మురుగన్‌ వదంతులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సాటైమురుగన్‌పై గూండా చట్టా న్ని ప్రయోగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement