![Google to bring India specific features on Google Maps - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/3/google.jpg.webp?itok=0ZAFdwVA)
చండీగఢ్: భారత్‌లో గూగుల్ మ్యాప్స్‌లో త్వరలో సరికొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. భారత్‌లో రోడ్డు మార్గాలు, ప్రజారవాణా వ్యవస్థలను కచ్చితత్వంతో అందుబాటులోకి తెస్తామని గూగుల్ మ్యాప్స్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ అనల్ ఘోష్ చెప్పారు.‘ టూవీలర్స్ మాత్రమే వెళ్లగలిగే రోడ్లను, షార్ట్‌కట్‌లను గూగుల్ మ్యాప్స్‌లో చేరుస్తాం. దేశంలోని 12,000 రైళ్ల ప్రయాణ వివరాలు చూపేలా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సాయంతో పబ్లిక్ టాయిలెట్లను గూగుల్ మ్యాప్స్‌లో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతోపాటు కోల్‌కతా, సూరత్ నగరాల్లో బస్సుల రాకపోకలపై రియల్ టైమ్ సమాచారాన్ని అందజేస్తున్నాం’ అని తెలిపారు. ఈ రియల్ టైమ్ సౌకర్యాన్ని మిగతా పట్టణాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు ఘోష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment