ప్రపంచంలో విభిన్న భాషలు గల దేశాలలో భారతదేశం ఒకటి అనే విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో 22 భాషలు అధికారిక భాషలుగా గుర్తింపు పొందాయి. ఇంకా గుర్తింపు పొందని వందలాది భాషలు దేశంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ తన ఉత్పత్తులను, సేవలను ఒక బిలియన్ భారతీయుల కోసం స్థానికంగా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. నేడు గూగుల్ ఎల్ 10ఎన్ ఇండియా పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో స్టార్టర్స్, వ్యాపారులు కోసం దేశంలోని గుజరాతీ, మరాఠీ, తమిళంతో సహా 9 స్థానిక భాషలలో గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కూడా ఈ భాషలలో సెర్చ్ చేయవచ్చని తెలిపింది. ప్రపంచంలోని మరెక్కడా లేని విధంగా ప్రతి నెలలో భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్ లెన్స్‌ను ఉపయోగిస్తున్నారు అని తెలిపింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మెరుగైన సేవలు అందించడానికి భారతీయుల కోసం గూగుల్ లెన్స్ ను సెర్చ్ లో జోడించినట్లు పేర్కొంది. (చదవండి: జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైనవి..)
Comments
Please login to add a commentAdd a comment