సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ తన దూకుడును పెంచింది. విలక్షణమైన ఇంకా ఎవరూ కనిపెట్టని కొత్త వినియోగ అనుభవాలతో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నఎల్‌జీ తన ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి మోడల్ సెప్టెంబర్ 14న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీజర్ వీడియోను విడుదల చేసింది.
ఎల్‌జీ తన గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన వీడియో ప్రకారం రొటేటింగ్, డ్యుయల్ స్క్రీన్ హ్యాండ్‌సెట్‌ను టీ షేప్ డిజైనుతో ఆవిష్కరించనుంది. ఎల్‌జి మొబైల్ గ్లోబల్ ఫేస్‌బుక్ , యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా సెప్టెంబర్ 14 న వర్చువల్ గా ఈ డివైస్ ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఎటువంటి నిర్దిష్ట వివరాలను కంపెనీ అందించలేదు. అయితే క్వాల్కమ్, రేవ్, ఫిక్టో, ట్యూబి, నావర్‌లతో సహా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఎల్‌జీ వింగ్ గా భావిస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై ఇలా ఉన్నాయి.
ఎల్‌జీ వింగ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
6.8 అంగుళాల డిస్ ప్లే
1:1 యాస్పెక్ట్ రేషియోతో 4 అంగుళాల మరో స్క్రీన్
స్నాప్‌డ్రాగన్ 765 జి సాక్
8జీబీ ర్యామ్
ట్రిపుల్ రియర్ కెమెరాలు
ధర సుమారు రూ. 73,000
Comments
Please login to add a commentAdd a comment