సాక్షివెబ్‌డెస్క్: ప్రముఖ యాప్ ట్రూలర్ కాలర్ వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అప్ డేట్ చేసిన ఫీచర్లతో ఒకే సారి 8మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడే అవకాశం లభించింది. దీంతో పాటు మరికొన్ని అప్ డేట్ గురించి తెలుసుకుందాం.
వాయిస్ కాల్స్
ట్రూ కాలర్ వినియోగదారులు అంతర్జాతీయ స్థాయిలో ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడే అవకాశం ఉంది. స్పామ్ వినియోగదారులను గుర్తిస్తుంది. గ్రూప్ కాల్ సభ్యులను కాంటాక్ట్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఇతర వినియోగదారులను మరొక కాల్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ పంపిస్తుంది.
స్పామ్ ఎస్‌ఎంస్
స్పామ్ కాల్స్‌ను గుర్తించటన్లుగా స్పామ్ మెసేజ్ లను ఫిల్టర్ చేస్తుంది. ఇప్పటికే ఓటీపీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, చెల్లింపు రిమైండర్‌లు మెసేజ్‌లను హైలైట్ చేస్తుండగా, తాజాగా ఈ ఫీచర్ ను అప్ డేట్ చేసి అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఫీచర్ వల్ల ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ ఎస్ఎంఎస్ ప్రస్తుతం భారత్, కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికాలో సౌలభ్యంగా ఉంది. ఇది త్వరలో యుఎస్, స్వీడన్, మలేషియా, ఇండోనేషియా, ఈజిప్ట్లకు విస్తరించబడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
ఇన్ బాక్స్ క్లియర్
ఓటీపీలు,స్పామ్ మెసేజెస్, ఓల్డ్ మెసేజ్ లను హైలెట్ చేస్తుంది. వాటి అవసరం లేదనుకుంటే ఒకే క్లిక్‌తో వాటిని తొలగించడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. దీంతో మెసేజ్ ఫోల్డర్ లో ఓల్డ్ మేసేజ్ లు కాకుండా లేటెస్ట్ మెసేజ్ లు మనకు హైలెట్ అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment