![WhatsApp Top five secrets every user should know about it - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/12/WhatsApp%20Top%20five%20secrets%20every%20user%20should%20know%20about%20it.jpg.webp?itok=4i_Hl8FR)
నిత్యం ఉపయోగించే సామాజిక మాద్యమాలలో వాట్సాప్‌ది ప్రత్యేక స్థానం. వాట్సాప్‌ను ప్రతి నెల 1.4 బిలియన్ల మంది వాడుతుంటే ఒకరోజులో వాట్సాప్ ద్వారా పంపించే మెసెజ్‌ల సంఖ్య అక్షరాల 60 బిలియన్లు. ప్రతి రోజు వాట్సాప్ తెరవకుండా ఉండలేని వారు కోట్లలోనే ఉన్నారంటే అందులో ఆశ్ఛర్యమేమి లేదు. అంతే కాదు మనలో చాలా మందికి తెలియని ఫీచర్లు ఎన్నో వాట్సాప్‌లో ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...
1) వాట్సాప్‌లో యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు
మన మిత్రులు పంపిన యూట్యూబ్ వీడియో లింక్‌ను అక్కడే ఓపెన్ చేసి చూడొచ్చు. ఏవైనా వీడియో సైట్ల నుంచి వచ్చిన నోటిఫికేషన్స్‌ను వాట్సాప్‌లో మనం చూసే అవకాశం ఉంటుంది. ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే వీడియో ఆన్‌లో ఉండగానే మనం చాట్ చేయోచ్చు అంతేకాదు వీడియోను క్లోజ్ చేయకుండానే వేరు వేరు వ్యక్తులతో చాట్ చేసే సౌలభ్యం కూడా ఉంది.
2) ఫోటోలకు స్టిక్కర్లు అంటించవచ్చు
ఫోటోలు, వీడియోలపై స్టిక్కర్లు అంటించడానికి ఉపయోగపడే టూల్ ఇందులో ఉంది. ఫోటోలపై వీడియోలపై లొకేషన్, టైం స్టిక్కర్లను అంటించి మనం ఎవరికైనా పంపే అవకాశం ఉంది. ఇందుకోసం వాట్సాప్‌లో ఉన్న + సింబల్‌ను నొక్కి మనకు అవసరమైన ఫోటోలపై వీడియోలపై స్టిక్కరింగ్ చేసుకోవాలి.
3) మనీ ట్రాన్స్‌ఫర్ సౌలభ్యం
వాట్సాప్‌లో మనీ ట్రాన్ఫర్స్‌లు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా డబ్బు పంపాలన్నా, మనం డబ్బు పొందాలన్నా వాట్సాప్‌లో చాట్ విండో క్లోజ్ చేయకుండానే చేసుకోవచ్చు.
4) వ్యక్తిగత గోప్యత
మీరు ఎప్పుడు చివరగా వాట్సాప్ ఓపెన్ చేశారు, ఎన్ని గంటలు చాట్ చేశారు అన్న విషయాలు మీ స్నేహితులకు, ఇతరులకు తెలియకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లోకి వెళ్లి ప్రైవసీలోని లాస్ట్ సీన్ ఆప్షన్‌లో నోబడిని క్లిక్ చేస్తే సరిపోతుంది.
5) డిలీట్ మెసెజ్
ఈ ఆప్షన్ ద్వారా మనం పోస్టు చేసిన మెసెజ్‌లను డిలీట్ చేయొచ్చు. మొదట మెసెజ్‌లు డిలీట్ చేయడానికి 7 నిమిషాల సమయం మాత్రమే ఉండేది కాని దానిని ప్రస్తుతం 68 గంటలకు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment