సాక్షి, ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకోసం త్వరలోనే మరో అయిదు కీలక ఫీచర్లను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కాలానుగుణంగా అప్‌డేట్స్‌తో వినియోగదారులకు ఆకట్టుకునే వాట్సాప్ తాజా అప్‌డేట్స్‌పై ఓ లుక్కేద్దాం.
మెసేజ్ ఎడిట్: వాట్సాప్ ద్వారా యూజర్లు పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. అయితే ఎడిట్ చేసుకునేందుకు మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు మాత్రమే సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉంది.
గ్రూపు మెంబర్స్ సంఖ్య: వాట్సాప్ గ్రూపులో గరిష్టంగా 512 మంది మరిమితమైన సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేయనుంది. దీంతో ఒక గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరే అవకాశం కలుగుతుంది.
షేర్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వాట్సాప్ ద్వారా ఒకరికొకరు క్యాప్షన్‌లతో డాక్యుమెంట్లను సెండ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫోటోలుమాదిరిగానే ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు.
స్క్రీన్ షాట్ బ్లాక్ : వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు, లేదా ఫోటోలను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశాన్ని రద్దు చేయనుంది. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, యూజర్లు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రీమియం సబ్ స్క్రిప్షన్: బిజినెస్ వాట్సప్ ఖాతాల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్‌ను ప్రారంభించింది. ధర ఇంకా వెల్లడించిపోయినప్పటికీ, వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్‌పై మాత్రమే సేవలను వాట్సాప్ అందించనుంది. వాట్సాప్ బిజినెస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment