ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో అదిరిపోయే ఫీచర్స్‌ను త్వరలోనే యూజర్లకు గూగుల్ అందించనుంది. ఈ కొత్త ఫీచర్స్‌తో, పిల్లల దినచర్యలను, కార్లను కంట్రోల్ చేయవచ్చునని గూగుల్ వెల్లడించింది. గూగుల్ తెస్తోన్న అద్బుతమైన ఫీచర్లతో యూజర్లకు స్మార్ట్‌ఫోన్స్ మరింత సహాయకరంగా మారనుంది. వీటిలో ఫ్యామిలీ బెల్, డిజిటల్ కార్ కీ లాంటివి సూపర్ ఫీచర్స్‌గా నిలవనున్నాయి.
ఫ్యామిలీ బెల్..కుటుంబ సభ్యులతో మమేకం..!
ఈ ఫీచర్‌తో కుటుంబంలోని సభ్యుల రిమైండర్స్‌ను, రోజువారీ షెడ్యూళ్లను మానిటర్ చేయవచ్చును. ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులు కలిసి ఉండే క్షణాలు చాలా తక్కువయ్యాయి. ఈ ఫీచర్‌తో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, హాలిడే లాంటివి ప్లాన్ చేసేందుకు ఉపయోగపడుతోంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయంపాటు గడిపేందుకు సహాయపడుతుంది. దీనిలో గూగుల్ ప్లే బుక్స్, యూట్యూబ్ మ్యూజిక్ లాంటి విడ్‌గెట్స్ కూడా రానున్నాయి.
గూగుల్ ఫోటోస్
గూగుల్ ఫోటోస్‌లో రానున్న కొత్త ఫీచర్స్‌తో మీ కుటుంబం, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను మీకు గుర్తు చేసే లక్ష్యంతో గూగుల్ ఫోటోస్ కొత్త మెమోరీస్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ జ్ఞాపకాలను ఫోటో గ్రిడ్‌లో కనిపిస్తాయి.
డిజిటల్ కార్ కీ..
ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లనుపయోగించి సదరు ఫీచర్ కల్గిన కార్లను లాక్ చేయడానికి, అన్‌లాక్ చేయడానికి గూగుల్ డిజిటల్ ఆటోమోటివ్ కీను అందుబాటులోకి తేనుంది. ఇది తొలుత బీఎమ్‌డబ్ల్యూ వాహనాల కోసం పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్‌ఫోన్లలో ఎంపిక చేయబడిన దేశాలలో విడుదల కానుంది. ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్‌ను సపోర్ట్ చేసే కార్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. గత ఏడాది డిజిటల్ ఆటోమోటివ్ కార్ల కీను యాపిల్ పరిచయం చేసింది. ఈ సదుపాయం కొన్ని లగ్జరీకార్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
జీబోర్డ్ ఎమోజీ కీబోర్డ్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు గూగుల్ జీబోర్డ్ అనే కీబోర్డ్‌ను పరిచయం చేసింది. జీబోర్డ్‌కు కూడా అప్‌డేట్ తీసుకురానుంది. ఈ అప్‌డేట్‌తో మీరు ఇతరులకు చెప్పదల్చుకున్న విషయాలను రెండు ఎమోజీలను ఒకే ఎమోజీగా కనవర్ట్ చేసి సెండ్ చేయవచ్చును. బీటా యూజర్లు రాబోయే రెండు, మూడు వారాల్లో జీబోర్ట్ ఎమోజీకిచెన్ ఫీచర్ అందుబాటులో రానుంది.
ఆటో రిసేట్..!
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ తీసుకువస్తోన్న చివరి ప్రధాన మార్పు ఆటో-రీసెట్ పరిష్మన్స్. మీరు ఇంతకాలం ఉపయోగించని డౌన్‌లోడ్ చేసిన యాప్‌ల కోసం రన్‌టైమ్ అనుమతులను ఆటోమెటిక్‌గా ఆఫ్ చేయడానికి ఈ ఫీచర్ మీ గాడ్జెట్‌ను ఎనేబుల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది.
చదవండి: వాట్సాప్ గ్రీవియన్స్ ఆఫీసర్ రాజీనామా?
Comments
Please login to add a commentAdd a comment