న్యూఢిల్లీ: జియోఫైనాన్స్ యాప్‌ను మరింత మెరుగ్గా ప్రారంభించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. రుణాలు, పొదుపు ఖాతాలు, యూపీఐ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, డిజిటల్ ఇన్సూరెన్స్‌తో సహా అనేక రకాల సేవలను ఈ యాప్ అందిస్తోంది.
జియోఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్ 2024 మే 30న ప్రారంభమైంది. 60 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. బీటా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులు సేవలు జోడించామని, మ్యూచువల్ ఫండ్‌లపై రుణాలు, గృహ రుణాలు (బ్యాలెన్స్ బదిలీతో) సహా ఆస్తిపై రుణాలు వీటిలో ఉన్నాయని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment