Gmail App Is Getting The Ability To Make Voice Video Calls in Major Update - Sakshi
Sakshi News home page

Gmail: జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌...!

Published Thu, Sep 9 2021 4:04 PM | Last Updated on Thu, Sep 9 2021 5:59 PM

Gmail App Is Getting The Ability To Make Voice Video Calls in Major Update - Sakshi

జీమెయిల్‌ యూజర్లకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌ను అందించింది. జీమెయిల్‌ మొబైల్‌ యాప్‌ను లేదా వెబ్‌ యాప్స్‌ను ఉపయోగించి నేరుగా గూగుల్‌ మీట్‌ యూజర్లకు వాయిస్‌, వీడియో కాల్స్‌ను చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుంగా జీమెయిల్‌ యూజర్లు ఒకరికొకరు వాయిస్‌, వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని కూడా కల్గించనుంది.  భవిష్యత్తులో వాయిస్‌ఇంటర్నెట్‌ ప్రొటోకాల్స్‌ను చేసే సామర్థ్యాన్ని కూడా గూగుల్‌ అందుబాటులోకి తీసుకురానుంది. జీమెయిల్‌ యాప్స్‌లో గ్రూప్‌ చాట్‌ సర్వీసులను కూడా యూజర్లు పొందే సౌకర్యాన్ని గూగుల్‌ అందించనుంది. 
చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

గూగుల్ ప్రకటించిన కొత్త ఫీచర్లలో భాగంగా జీమెయిల్‌ యాప్స్‌లో చాట్, స్పేసెస్‌, గూగుల్‌ మీట్‌ వంటి మూడు ట్యాబ్‌లను వర్క్‌స్పేస్ టూల్స్‌కు మరింతగా అనుసంధానంగా ఉండనున్నాయి. గూగుల్‌ మీట్‌ బటన్‌పై క్లిక్‌ చేసిన తరువాత జనరేట్‌ ఐనా లింక్‌ను ఇతరులకు పంపడం ద్వారా వీడియో కాలింగ్‌ను చేయవచ్చును ప్రస్తుతం తెచ్చిన ఫీచర్‌తో నేరుగా జీమెయిల్‌ ఖాతాతో గూగుల్‌ మీట్‌ పాల్గొనే సదుపాయం కల్గనుంది. తాజాగా గూగుల్‌ మీట్‌ కంపానియన్‌ మోడ్‌ను నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్‌ ప్రయత్నిస్తుంది.  

గూగుల్‌ క్యాలెండర్, డ్రైవ్, డాక్స్, షీట్‌, స్లయిడ్‌లు, మీట్, టాస్క్‌లతో సహా ఇతర గూగుల్ వర్క్‌స్పేస్ టూల్స్‌ సహకారంతో టీమ్‌ మీటింగ్‌లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గూగుల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.   గ్రూప్ చాట్ లాంటి ఫీచర్‌లో భాగంగా పాల్గొనేవారికి డాక్యుమెంట్‌లను షేర్ చేయడానికి సులువుగా ఉండనుంది. యూజర్ల మధ్య జరిగిన కన్వర్‌సేషన్‌ను పూర్తిగా సేవ్‌ చేసుకోవచ్చును. గూగుల్‌ అదనంగా గూగుల్‌ క్యాలెండర్‌ పలు కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ వర్క్‌ డే లోకేషన్‌ స్టోర్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. 

చదవండి: మైక్రోసాఫ్ట్‌ తర్వాత మరో రెండు స్టార్ట్‌ మెనూలు.. ఎబ్బెట్టుగా ఉందని ఫీడ్‌బ్యాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement