ఐఫోన్ యూజర్లకు ఫేస్ బుక్ కొత్త ఫీచర్లు
మీ దగ్గర ఐఫోన్ లేదా ఐపాడ్ ఉందా...! అయితే మీకోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రెండు కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తోంది. ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే స్లయిడ్ లతో ఫోటోలను, వీడియోలను తేలికగా వీక్షించే ఫీచర్ తో పాటు... యూజర్లు ఎంపికచేసుకున్న ఫేస్ బుక్ ఈవెంట్లను యాక్సస్ చేసుకునే సౌకర్యాన్ని మరో ఫీచర్ ద్వారా యూజర్ల ముందుకు తీసుకొస్తోంది. ఈ కొత్త స్లయిడ్ ఫీచర్ ద్వారా ఎవరైనా పోస్టు చేసిన వీడియోలను, చిత్రాలను తేలికగా స్లయిడ్ ల రూపంలో వీక్షించవచ్చని టెక్ క్రంచ్ వెబ్ సైట్ పేర్కొంది. ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేస్తోందని తెలిపింది.
ఫేస్ బుక్ ఆవిష్కరిస్తున్న ఈ ఫీచర్లో యూజర్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోటోలు లేదా వీడియోలను 24 గంటల్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కువ ఫోటోలను జోడించడం, రీప్లేస్ చేయడం, తొలగించడం వంటిది ఈ స్లయిడ్ తనకు తానుగా మలుచుకుంటుంది. స్లయిడ్ ట్రాన్సిక్షన్ ను, థీమ్ ను యూజర్లే ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. నోస్టాల్జిగ్, ప్లేఫుల్, నైట్ అవుట్, ఎపిక్, థాంక్ ఫుల్, ట్రోపికల్, బాలీవుడ్, ఆంపిడ్ వంటి 10 రకాల థీమ్ లను ఫేస్ బుక్ ఈ ఫీచర్లో అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ ను మొదట యాపిల్ ఐఓఎస్ యూజర్లకు ప్రారంభించిన తర్వాత ఇతర ప్లాట్ ఫామ్ లకు భవిష్యత్తులో అందుబాటులో తీసుకొస్తామని కంపెనీ చెప్పింది.
అదేవిధంగా యూఎస్ లోని 10 మేజర్ సిటీలో ఈవెంట్లను ఎంపికచేసుకునే సౌకర్యాన్ని ఫేస్ బుక్ యూజర్లకు సూచించనుంది. బోస్టన్, చికాగో, డాలస్, హోస్టన్, లాస్ ఏంజెల్స్, మియామి, న్యూయార్క్ సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో సిటీ, సీటిల్, వాషింగ్టన్ డీసీ వంటి సిటీల్లో ఫేస్ బుక్ ఐఓఎస్ యూజర్లకు ఈవెంట్స్ ట్యాబ్ లో ఫీచర్డ్ ఈవెంట్స్ సెక్షన్ ను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.మ్యూజిక్, ఫుడ్, వీకెండ్ వంటి ప్రత్యేక ఈవెంట్ కేటగిరీలను ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎంపికచేసుకోవచ్చు.