కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ద్వారా తమ వారికి దగ్గరవుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో మాములు కాల్స్ కంటే వాట్సాప్ కాల్స్‌నే ఎక్కువ మంది వినియోగిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌తో రాబోతుంది. అదే వాట్సాప్ లోన్. ఇప్పుడు భారతీయులందరికి లోన్ ఇవ్వడానికి వాట్సాప్ రెడీ అయ్యింది. ఇప్పటికే పేమెంట్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న వాట్సాప్ త్వరలో ఇండియాలో వాట్సాప్ వాడుతూ అర్హులైన వారందరికి అవసరాల కోసం డబ్బును అప్పుగా ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. (వాట్సాప్ యూజర్లకు శుభవార్త)
వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ తన ఫైనాన్షియల్ సర్వీసులను మరింత విస్తరించాలని భావిస్తుండటంతో క్రెడిట్ సర్వీస్‌ను భారత్‌లో ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా పొందింది.ఈ ఫీచర్ మనకి పేమెంట్ల ఆప్షన్‌లో కూడా కనబడుతుంది. ప్రస్తుతం తొలిదశలోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. (వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే)
Comments
Please login to add a commentAdd a comment