హూస్టన్: మహిళలపై ఆన్‌లైన్ వేధింపులను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆకతాయిల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు రాకుండా ఈ కొత్త ఫీచర్లు అడ్డుకుంటాయి. ఢిల్లీకి చెందిన, మహిళా సాధికారత కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్’తో కలసి ఫేస్‌బుక్ ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఐపీ అడ్రస్‌లు ఇతర సంకేతాలను ఉపయోగించడం ద్వారా నకిలీ ఖాతాలను గుర్తించి ఫేస్‌బుక్ వాటిని డీయాక్టివేట్ చేస్తుంది. అలాగే ఎవరైనా సందేశాలు పంపి విసిగిస్తున్నప్పుడు దానిని అనవసర సందేశం (అన్‌వాంటెడ్ మెసేజ్) అని మార్క్ చేస్తే ఇకపై ఆ మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు రావు. అవన్నీ ఒక ప్రత్యేక ఫోల్డర్‌లో సేవ్ అయ్యుంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా వినియోగదారులు వాటిని చదివినా అవతలి వ్యక్తికి ఆ విషయం తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment