![Man Attacks Bank Manager Over Tax Deduction In Gujarat](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/8/fixed%20deposit.jpg.webp?itok=K4WCI7o2)
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచిది. కానీ చేసే ముందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభ నష్టాల్ని ఒక్కసారి బేరీజు వేసుకోండి. లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎందుకు చేశానురా భగవంతుడా అనుకుంటూ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వస్త్రపూర్‌కు చెందిన జైమన్ రావల్ తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయనే నమ్మకంతో యూనియన్ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తి కావడంతో తన తల్లితో పాటు బ్యాంక్‌కు వచ్చారు. అనంతరం, బ్యాంక్ మేనేజర్ సంప్రదించి తన ఫిక్స్‌డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తియ్యింది. డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నాను. సంబంధింత ప్రాసెస్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో సదరు బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని డబ్బులు విత్ డ్రా ప్రాసెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఎఫ్‌డీపై ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవ్వడాన్ని గమనించారు.
ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్‌తో ప్రస్తావించారు. బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చిన సమాధానంతో కస్టమర్ జైమన్ రావెల్ సహనం కోల్పోయారు. ఎదురుగా ఉన్న బ్యాంక్ మేనేజర్ కాలర్ పట్టుకుని ప్రశ్నించారు. బ్యాంక్ మేనేజర్ సైతం కస్టమర్ చొక్కా కాలర్ పట్టుకున్నారు. అంరతరం ఇరువురి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'Customer' turned 'Crocodile' after TDS Deduction in Bank FD. FM sud instruct Bank staffs to learn 'taekwondo' for self defense. pic.twitter.com/CEDarfxcqi
— Newton Bank Kumar (@idesibanda) December 6, 2024
కుమారుడు, బ్యాంక్ మేనేజర్‌ల మధ్య జరుగుతున్న గొడవని ఆపేందుకు కస్టమర్ తల్లి ప్రయత్నాలు చేసింది. బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగి శుభమన్‌ను కోరింది. ఇరువురి మధ్య కోట్లాట తారాస్థాయికి చేరడంతో చేసేది లేక ఆ తల్లి తన కుమారుడిని కొట్టింది. దీంతో తల్లి కొట్టడంతో కుమారుడు వెనక్కి తగ్గడంతో గొడవ సర్ధుమణిగింది. బ్యాంక్‌లో జరిగిన దాడిపై సమాచారం అందుకున్న వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లే కాదు, ఇతర బ్యాంక్ లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు సేవింగ్స్ విషయంలో లాభనష్టాల గురించి ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. బ్యాంక్‌లో దాచుకునే డబ్బులుపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా ట్యాక్స్ కట్టే పని లేకుండా నిబంధనలు పాటిస్తూ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అందుకే డబ్బులు దాచుకునే విషయంలో కస్టమర్లకు సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment