government bank
-
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిది. కానీ చేసే ముందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభ నష్టాల్ని ఒక్కసారి బేరీజు వేసుకోండి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేశానురా భగవంతుడా అనుకుంటూ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగింది.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వస్త్రపూర్కు చెందిన జైమన్ రావల్ తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయనే నమ్మకంతో యూనియన్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తి కావడంతో తన తల్లితో పాటు బ్యాంక్‌కు వచ్చారు. అనంతరం, బ్యాంక్ మేనేజర్ సంప్రదించి తన ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తియ్యింది. డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నాను. సంబంధింత ప్రాసెస్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.దీంతో సదరు బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని డబ్బులు విత్ డ్రా ప్రాసెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఎఫ్డీపై ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవ్వడాన్ని గమనించారు.ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్‌తో ప్రస్తావించారు. బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చిన సమాధానంతో కస్టమర్ జైమన్ రావెల్ సహనం కోల్పోయారు. ఎదురుగా ఉన్న బ్యాంక్ మేనేజర్ కాలర్ పట్టుకుని ప్రశ్నించారు. బ్యాంక్ మేనేజర్ సైతం కస్టమర్ చొక్కా కాలర్ పట్టుకున్నారు. అంరతరం ఇరువురి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.'Customer' turned 'Crocodile' after TDS Deduction in Bank FD. FM sud instruct Bank staffs to learn 'taekwondo' for self defense. pic.twitter.com/CEDarfxcqi— Newton Bank Kumar (@idesibanda) December 6, 2024 కుమారుడు, బ్యాంక్ మేనేజర్ల మధ్య జరుగుతున్న గొడవని ఆపేందుకు కస్టమర్ తల్లి ప్రయత్నాలు చేసింది. బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగి శుభమన్‌ను కోరింది. ఇరువురి మధ్య కోట్లాట తారాస్థాయికి చేరడంతో చేసేది లేక ఆ తల్లి తన కుమారుడిని కొట్టింది. దీంతో తల్లి కొట్టడంతో కుమారుడు వెనక్కి తగ్గడంతో గొడవ సర్ధుమణిగింది. బ్యాంక్‌లో జరిగిన దాడిపై సమాచారం అందుకున్న వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లే కాదు, ఇతర బ్యాంక్ లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు సేవింగ్స్ విషయంలో లాభనష్టాల గురించి ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. బ్యాంక్‌లో దాచుకునే డబ్బులుపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా ట్యాక్స్ కట్టే పని లేకుండా నిబంధనలు పాటిస్తూ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అందుకే డబ్బులు దాచుకునే విషయంలో కస్టమర్లకు సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. -
నిధుల సమీకరణలో ప్రభుత్వ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో నిధులను సమకూర్చుకోవడంలో దూకుడు ప్రదర్శించాయి. వెరసి రుణాలు, ఈక్విటీ మార్గాలలో దాదాపు రూ. 58,700 కోట్లు సమీకరించాయి. ఒక ఏడాదిలో ఇది సరికొత్త రికార్డు కాగా.. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులను పెంపొందించుకోవడంలో బ్యాంకులు జోరు చూపాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 4,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 2,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ప్రయివేట్ ప్లేస్మెంట్) రూ. 3788 కోట్లు చొప్పున అందుకున్నాయి. క్విప్‌లు విజయవంతంకావడం పీఎస్‌బీల పట్ల దేశ, విదేశీ ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 12 పీఎస్‌బీలు రికార్డుకు తెరతీస్తూ టైర్–1, టైర్–2 బాండ్ల జారీ ద్వారా గతేడాది రూ. 58,697 కోట్లు సమీకరించాయి. సంస్కరణల ఎఫెక్ట్ గుర్తింపు, రుణ పరిష్కారాలు, కొత్తపెట్టుబడులు వంటి పలు ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) తగ్గడంతోపాటు.. లాభాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా పీఎస్‌బీల ఎన్పీఏలు రూ. 6,16,616 కోట్లకు తగ్గాయి. 2020లో ఇవి రూ. 6,78,317 కోట్లుకాగా.. 2019లో రూ. 7,39,541 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ప్రొవిజన్ల కవరేజీ నిష్పత్తి 84 శాతానికి బలపడింది. గత ఐదేళ్లలోలేని విధంగా ప్రభుత్వ బ్యాంకుల లాభాలు రూ. 31,816 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాది ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించినప్పటికీ పటిష్ట పనితీరును కనబరిచాయి. 2020లో నమోదైన రూ. 26,015 కోట్ల నష్టాల నుంచి ఈ స్థాయి టర్న్‌అరౌండ్‌ను సాధించడానికి మొండి రుణ సవాళ్లను అధిగమించడం సహకరించింది. ఎన్పీఏల నియంత్రణ, రికవరీ చర్యలు ఇందుకు తోడ్పాడునిచ్చాయి. గత ఆరేళ్లలో పీఎస్‌బీలు రూ. 5,01,479 కోట్లను రికవరీ చేయడం గమనార్హం. ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా. -
ఎన్ని చేసినా ఫలితం లేదు!
ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తగిన రుణ సౌలభ్యం సకాలంలో అందాలని, రుణ పరిమాణం భారీగా పెరగాలని ప్రభుత్వ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నా, ఫలితం కనిపించడం లేదు. 2018 డిసెంబర్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (మార్కెట్) వాటా 39% అయితే, 2013 ఇదే నెల్లో ఈ రేటు 58%గా ఉంది. ప్రభుత్వ రంగ భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్సూనియన్ సిబిల్ల తాజా నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ ముద్ర, 59 సెకండ్ లోన్ స్కీమ్స్ వంటి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, చిన్న పరిశ్రమలకు రుణాల్లో తమ మార్కెట్ వాటాను ప్రభుత్వ బ్యాంకులు కోల్పోతున్నాయి. ♦ దీనికి కారణాల్లో ఎన్పీఏల సమస్య ఒకటి. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి చిన్న పరిశ్రమలకు మార్కెట్ షేర్ తగ్గినా, ప్రైవేటు రంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి మాత్రం పెరిగింది. ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే... 2013 డిసెంబర్లో చిన్న పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో వీటి వాటా 22 శాతం అయితే, 2018 డిసెంబర్లో ఈ రేటు 33 శాతానికి చేరింది. నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల విషయంలో ఈ రేటు 13 శాతం నుంచి 21 శాతానికి ఎగసింది. ♦ అయితే రుణ పంపిణీలను విలువల రూపంలో మాత్రం నివేదిక వెల్లడించలేదు. ♦ కాగా ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి తమ మార్కెట్ షేర్‌ను పెంచుకోగలుగుతాయన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ♦ చిన్నపరిశ్రమల ఎన్పీఏలు క్యూ4 కొంత తగ్గాయి. ♦ ఇక చిన్న పరిశ్రమలకు మొత్తం రుణాలను చూస్తే, 2018 డిసెంబర్‌తో ముగిసిన ఐదేళ్ల కాలంలో వృద్ధిరేటు 19.3 శాతంగా ఉంది. ♦ ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యవస్థలో రుణ లభ్యతపై ప్రత్యేకించి ఈ విషయంలో చిన్న తరహా పరిశ్రమల విషయంపై దృష్టి సారించారు. ఎన్పీఏలపై జాగరూకత అవసరం మొత్తంగా చూస్తే లఘు, చిన్న మధ్య తరహా పరి శ్రమలకు రుణాలు పెరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రత్యేకించి ఈ రంగంలో మొండిబకాయిల సమస్య తీవ్రమవకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ దిశలో తమ పోర్టిఫోలియోలను లెండర్లు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. వ్యవస్థాపరమైన ఇబ్బందులు లేకుండా విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలి. – సతీష్ పిళ్లై, ఎండీ అండ్ సీఈఓ, ట్రాన్సూనియన్ సిబిల్ -
జీతంలో రూ.10 వేలు చేతికి!
♦ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే యోచనలో ♦ సర్కారు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ♦ ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా డ్రా చేసుకునే వెసులుబాటు ♦ ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరనున్న ప్రభుత్వం ♦ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరిన ఫైలు సాక్షి, హైదరాబాద్: ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు యోచిస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం విత్‌డ్రాపై ఆంక్షలు విధించడంతో ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుు. కనీసం రూ.10 వేల నగదు చేతికిచ్చేలా ఏర్పాట్లు చేయాలని టీఎన్జీవో ప్రతినిధులు సీఎస్ రాజీవ్‌శర్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలను నేరుగా చెల్లించటం వీలు కాదని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఆర్బీఐ విధించిన నగదు విత్‌డ్రా పరిమితి ఆంక్షల ప్రకారం ఏటీఎంల నుంచి రూ.2 వేలు మాత్రమే డ్రా చేసుకునే వీలుంది. ఖాతాదారులు బ్యాంకు నుంచి రోజుకు రూ.10 వేలు, గరిష్టంగా వారంలో రూ.24 వేలు మించకుండా డ్రా చేయాలి. కానీ రాష్ట్రంలో దాదాపు ఎనభై శాతం ఏటీఎంలలో డబ్బు లేదు. బ్యాంకు బ్రాంచీల్లోనూ డబ్బు లేకపోవటంతో ఖాతాదారులు సైతం లైన్లలో గంటల తరబడి నిలబడి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఒకటో తారీఖున ఉద్యోగులు ముప్పు తిప్పలు పడటం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉద్యోగులందరికీ ఒకటో తేదీన కనీసం రూ.10 వేలు చేతికందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఉద్యోగులందరికీ సరిపడే నగదును అందుబాటులో ఉంచటం, ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా అంత మేరకు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని యోచిస్తోంది. ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రూ.10 వేలు ఉద్యోగులకు చెల్లించేందుకు అవసరమైన చర్యలు, ప్రతిపాదనలతో ఆర్థిక శాఖ ఫైలును సిద్ధం చేసింది. ఈ ఫైలును ముఖ్యమంత్రికి పంపించినట్లు తెలిసింది. సీఎం నిర్ణయం మేరకు నగదు చెల్లించాలా.. వద్దా.. అనే విషయంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను చర్చించేందుకు గురువారం రాష్ట్రస్థారుు బ్యాంకర్లతో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందులో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశాన్ని చర్చించే అవకాశాలున్నారుు. -
ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి కసరత్తు
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన ♦ బ్యాంకింగ్ సామర్థం పెంపుపై ♦ దృష్టి పెడతామని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు తాజా పెట్టుబడులను అందించి, పటిష్టపర్చిన అనంతరం వాటి విలీనాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యం పెంపునకూ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ‘భారత్ ఆకాంక్షలు-ఆర్థిక అవసరాలను కేపిటల్ మార్కెట్లు ఎలా నెరవేర్చగలుగుతాయి’ అన్న అంశంపై ఎన్ఎస్ఈ, ఐఐఎఫ్, ఎగ్జిమ్ బ్యాంక్‌తో కలిసి ఐఎఫ్‌సీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సులో జైట్లీ మాట్లాడారు. అందుబాటులో ఉన్న వనరులకు లోబడి ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం సమకూర్చడం, వాటి పటిష్టతే ధ్యేయంగా కేంద్రం ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వడ్డీరేట్లు తగ్గుతున్న వ్యవస్థలో తయారీ రంగం మరింత పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అవుతుందన్నది తమ విశ్వాసమని అన్నారు. గడచిన ఏడాదిన్నరగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వృద్ధికి దోహదపడే ‘సరళతర విధానం’ దిశగా అడుగులు వేయడం హర్షణీయ పరిణామమని అన్నారు. రేటు కోతకు తగిన స్థూల ఆర్థిక అంశాలు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, విదేశీ మారకపు నిల్వల వంటి స్థూల ఆర్థికాంశాలు పటిష్టంగా ఉన్నట్లు వివరించారు. వ్యాపార వాతావరణం మెరుగుకు కృషి దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నమంతా చేస్తుందని జైట్లీ పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పారదర్శకత నెలకొల్పడానికి తగిన చర్యలు అన్నీ తీసుకుంటున్నామన్నారు. తక్కువ స్థాయిలో చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశంగా వివరించారు. దిగుమతులు పడిపోవడానికి అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కారణమని పేర్కొన్న జైట్లీ.. ఇలాంటి ఒడిడుడుకులు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరని అన్నారు. అంతర్జాతీయంగా ఎన్నో అవరోధాలు ఉన్నా... భారత్ వృద్ధి తగిన ఆర్థిక ఫలితాలను కొనసాగిస్తోందని వివరించారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న రంగాల్లో వ్యవసాయం ఒకటని అన్నారు. రెండేళ్ల నుంచీ నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముద్ర పథకం కింద గత ఆర్థిక సంవత్సరం దాదాపు మూడు కోట్ల మందికి రుణాలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరగాలన్నది లక్ష్యమని తెలిపారు. 25 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి దేశ వ్యాప్తంగా 25 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దేశంలో దాదాపు 160 ఎయిర్‌స్ట్రిప్స్ నిరుపయోగంగా పడిఉన్నట్లు పేర్కొన్నారు. విమానయాన రంగం పురోగతికి తగిన అన్ని ప్రయత్నాలనూ కేంద్రం చేస్తున్నట్లు తెలిపారు. -
9 బ్యాంకులకు రూ.6,990 కోట్ల నిధులు
ఎస్బీఐకు అధికంగా రూ.2,970 కోట్లు: కేంద్రం న్యూఢిల్లీ: ఎట్టకేలకు పభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం సాయం అందించింది. మొత్తం తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూల ధన అవసరాల కింద రూ.6,990 కోట్ల నిధులను అందజేస్తున్నట్లు శనివారం స్పష్టంచేసింది. ఎన్ పీఏల కారణంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులు... తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు, మరిన్ని రుణాలిచ్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. అన్ని బ్యాంకుల కంటే ఎస్బీఐకు అధికంగా (రూ.2,970 కోట్లు) నిధులు లభిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,260 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.870 కోట్లు, కెనరా బ్యాంక్‌కు రూ.570 కోట్లు, సిండికేట్ బ్యాంక్‌కు రూ.460 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ.320 కోట్లు, ఇండియన్ బ్యాంక్‌కు రూ.280 కోట్లు, దేనా బ్యాంక్‌కు రూ.140 కోట్లు, ఆంధ్రాబ్యాంక్‌కు రూ.120 కోట్లు చొప్పున లభిస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పీఎస్‌యూ బ్యాంకులకు రూ.11,200 కోట్లు మూలధన నిధులు కేటాయించగా, మొదటి విడతగా రూ.6,990 కోట్లను అందిస్తోంది. మిగిలిన రూ.4,210 కోట్ల నిధులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బాసెల్-3 నిబంధనలను అందుకోవాలంటే బ్యాంక్‌లకు 2018 కల్లా రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి. -
కొనేముందు... ఒక్కమాట..!
కొత్త సంవత్సరం వచ్చేసింది. మార్కెట్ సూచీలేమో గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. కొన్ని షేర్లు కూడా ఇప్పటికే తారాజువ్వల్లా ఎగసి... అత్యధిక రేట్ల దగ్గర కదులుతున్నాయి. మరోవంక ఆర్థిక పరిస్థితులేమో అంతంతమాత్రంగానే ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రూపాయి క్షీణిస్తూనే ఉంది. అంతర్జాతీయంగా కూడా పరిణామాలేమీ అంత ఆశాజనకంగా లేవు. వీటన్నిటికీ తోడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలొచ్చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? అనే అంశాలపై ఎవరెన్ని సర్వేలు చేస్తున్నా ఇప్పటికీ ఒక స్పష్టతయితే లేదు. మరి మదుపరులు ఏం చేయాలి? ఏ రంగం బాగుంటుంది? ఒకవేళ బాగుంటే ఎందుకు బాగుంటుంది? ఆ రంగంలో మనం కొనుక్కోదగ్గ షేర్లేమయినా ఉన్నాయా? ఇవన్నీ ఇన్వెస్టర్లను తొలిచేస్తున్న సందేహాలే. అందుకే వీటన్నిటినీ ైరైట్ హొరైజన్స్ సంస్థ సీఈఓ అనిల్ రెగో ముందుంచింది సాక్షి. ఫైనాన్షియల్ ప్లానర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు కూడా అయిన రెగో వీటికి ఏం చెప్పారన్నదే ఈ కథనం... గ్రామీణ ఆటో బాగుంటుంది ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. అందుకని గ్రామాల్లో ఆదాయం బాగుంది. అందుకని వారి ఖర్చూ పెరుగుతుంది. మరొకటేమిటంటే ఎన్నికల సంవత్సరంలో డబ్బు లభ్యత పెరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి కూడా గ్రామాల్లో వినిమయం పెరుగుతుంది. ఈ లెక్కన చూస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఈ ఏడాది ఆటో మొబైల్ రంగం సానుకూలంగా ఉండే అవకాశముంది. ప్రస్తుతం ఆటో మొబైల్ కంపెనీ షేర్ల సగటు పీఈ విలువ మార్కెట్ పీఈకి సమానంగా ఉంది. టూ వీలర్స్ అమ్మకాలు బాగుండొచ్చు కనక డే హీరో మోటార్స్వైపు చూడొచ్చు. ఈ సానుకూలాంశాలకు తోడు జేఎల్ఆర్ పనితీరు మెరుగవుతోంది కనక టాటా మోటార్స్ షేర్లనూ పరిగణనలోకి తీసుకోవచ్చు. బ్యాంకులు దుమ్ము దులుపుతాయ్! ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల షేర్లు బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వాటికి మొండి బకాయిలు తక్కువ. చౌకగా డిపాజిట్లను తెచ్చే కాసా నిష్పత్తి ఎక్కువ. వీటన్నిటికీ తోడు ఫీజు ఆదాయాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల షేర్ల విషయానికొస్తే ప్రస్తుతం అవి చాలా చౌకగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల విలువ... వాటి పుస్తక విలువ (బుక్‌వేల్యూ) కంటే 72% తక్కువగా ఉంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నిటినీ కలిపి చూస్తే వాటి విలువ సగటు పుస్తక విలువ కంటే 42% తక్కువగా ఉంది. ఎస్బీఐ, బీఓబీలను మినహాయిస్తే మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లన్నీ వాటి పుస్తక విలువ కంటే 45-50% తక్కువ రేటులో ట్రేడ్ అవుతున్నాయి. ఒకసారి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చి, ఆర్థిక వృద్ధి గాడిలో పడితే... అన్నిటికంటే అత్యధికంగా లబ్ధి పొందేవి ప్రభుత్వ రంగ బ్యాంకులే. కాకుంటే వడ్డీరేట్లు తగ్గేదాకా పీఎస్‌యూ బ్యాంకు షేర్లతో జాగ్రత్తగా ఉం డాలి. ఈ సమయంలో ప్రైవేటు బ్యాంకుల కేసి మొగ్గు చూపొచ్చు. ఎన్‌బీఎఫ్‌సీలకు దూరంగా ఉండండి... ఎం అండ్ ఎం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మినహాయించి మిగిలిన ఎన్బీఎఫ్సీ షేర్లన్నీ ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒకవైపు ఎన్పీఏలు పెరుగుతున్నాయి. మరోవంక గృహరుణాల డిమాండ్ తగ్గింది. హెచ్డీఎఫ్సీ, శ్రేయి ఇన్ఫ్రా, ఇండియా బుల్స్ హౌసింగ్, డీహెచ్ఎఫ్ఎల్ వంటి షేర్లన్నీ వాటి సగటు పుస్తక విలువ కంటే 40 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయిపుడు. అయితే వీటి బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి ఉంది కనక, ఎన్పీఏలు పెరుగుతున్నాయి కనక వీటికి దూరంగా ఉండటమే మంచిది. కనీసం ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకైనా...! క్యాపిటల్ గూడ్స్‌పై ఒత్తిడి వాటి చరిత్రాత్మక సగటు విలువతో పోలిస్తే క్యాపిటల్ గూడ్స్ రంగం షేర్లు 45 శాతం తక్కువ ధర వద్దే ఉన్నాయి. కానీ వీటిలో హావెల్స్, ఎల్ అండ్ టీ వంటి కొన్ని షేర్ల పనితీరు ఇంకాస్త బాగుంది. దీనికి కారణం వీటి ఆర్డర్ల బుక్, పనితీరు బాగుండటమే. వడ్డీరేట్లతో ముడిపడి ఉన్న రంగం కావడంతో రేట్లు తగ్గే వరకు ఆగడం మంచిది. మంచి కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగించొచ్చు. గాడిలో పడుతున్న సిమెంట్ జేపీ అసోసియేట్స్ సిమెంట్ ప్లాంట్‌ను అల్ట్రాటెక్ కొనడం మంచి పరిణామం. విదేశీ కంపెనీలు దేశీయ సిమెంట్ కంపెనీలపై ఆసక్తి చూపిస్తున్న విషయం దీనిద్వారా బయటపడింది. అందుకే ఈ రంగంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సిమెంట్ డిమాండ్ పెరుగుతుందన్న ఆశ కూడా మరో కారణం. దీంతో వాటి సగటు విలువల కంటే 4% ప్రీమియంతో ఈ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ప్రీమియంలో కన్సూమర్ గూడ్స్... ఈ రంగంలోని ప్రధాన షేర్లన్నీ ప్రస్తుతం ప్రీమియం ధరల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ 50%, జీసీపీఎల్ 47%, ఐటీసీ 38%, పిడిలైట్ 49% అధిక ధరలలో (సగటు కంటే) ఉన్నాయి. ఈ రం గంపై దూకుడు తగ్గించటమే మంచిది. పెట్టుబడుల్లో వైవిధ్యం చూపించాలంటే ఐటీసీ వంటి నాణ్యమైన షేర్ల కేసి చూడొచ్చు. ఆరోగ్యానికి అమెరికా ధీమా ఆరోగ్య పరిరక్షణ రంగంలోని షేర్లన్నీ వాటి గత సగటుతో పోలిస్తే 22 శాతం అధిక ధరల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ, అమెరికా వృద్ధి, పెరుగుతున్న యూఎస్ ఎఫ్‌డీఏల అనుమతులతో ఈ రంగం ఇంకా ఆకర్షణీయంగానే ఉందని చెప్పాలి. సన్ ఫార్మా, దివీస్ ల్యా బ్ షేర్లను ఇంకా కొనచ్చు. తగ్గినప్పుడల్లా అపోలో హాస్పిటల్స్ షేర్లను కొనుగోలు చేయటం మంచిది. మీడియా మరీ చౌక కాదు మీడియా షేర్లన్నీ గత సగటు పీఈ ధరల కంటే కేవలం ఆరు శాతం తక్కువ ధర వద్ద ఉన్నాయి. డిజిటలైజేషన్‌తో అధికంగా లబ్ధిపొందిన ‘‘జీ’’ షేరు ఒక్కటే సగటు కంటే ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతోంది. సినీమ్యాక్స్ను కొనుగోలు చేయడం వల్ల పీవీఆర్ పరిస్థితి కూడా బాగుంది. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రకటనలు బాగా పెరిగే అవకాశం ఉంది. విలువ పరంగా చాలా చౌకగా ఉన్నాయి కనక ఈ ఏడాది ప్రింట్ మీడియా షేర్లు బాగుండే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్.. వేచి చూడాల్సిందే... గతంలోని సగటుతో పోలిస్తే 63 శాతం చౌకగా లభిస్తున్నప్పటికీ అధిక వడ్డీరేట్లు, డిమాండ్ లేకపోవడం వంటి కారణాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోందనే చెప్పాలి. వడ్డీరేట్లు తగ్గు ముఖం పట్టే వరకు వేచి చూడాల్సిందే. టెక్నాలజీ... ఇంకా చౌకే.. గడిచిన ఏడాదిలో ఐటీ రంగం 48% లాభాలు అందించినప్పటికీ వాటి సగటు పీఈ విలువలతో పోలిస్తే ఐటీ షేర్లు ఇంకా చౌకగానే ఉన్నాయి. గతంలోని సగటు విలువ (ప్రైస్ టు బుక్)తో పోలిస్తే ఇన్ఫోసిస్ 38 శాతం, టెక్ మహీంద్రా 28% డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ ఒక్కటే 6% ప్రీమియం ధరలో ఉంది. యూరప్, అమెరికా వృద్ధి, రూపాయి క్షీణతతో ఈ రంగం లబ్ధి పొందుతోంది. -
బ్యాంక్‌ను మోసగించిన కేసులో మాజీ బ్యాంక్ అధికారికి జైలు
న్యూఢిల్లీ: ఓ ప్రభుత్వ బ్యాంక్‌ను రూ. 2.63 కోట్ల మేరకు మోసగించిన ఓ మాజీ బ్యాంక్ అధికారి సహా నలుగురికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి గుర్విందర్ పాల్ సింగ్ ‘‘నిందితులు విపుల్ శర్మ, అతని భార్య రజిని, రాజేశ్‌కుమార్, విజయ బ్యాంక్ మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హెచ్‌జీ పాయ్ కుమ్మక్కై జాతీయబ్యాంక్ కు భారీ నష్టం కలిగించారు. వీరి కుట్ర కారణంగా ఢిల్లీ కంటోన్మెంట్ విజయబ్యాంక్ రూ. 2.63 కోట్లు నష్టం చవిచూసింది. ఎలాంటి పూచికత్తు లేకుండా భారీ మొత్తాన్ని నిందితులకు ఇవ్వడం వలన ఈ నష్టం సంభవించింది’’ అని తీర్పులో పేర్కొన్నారు. ‘‘ఎవరైనా ఉద్రిక్తతకు లోనైనప్పుడు హత్యలు చేసే అవకాశం ఉండొచ్చు. ఆర్థిక నేరాలు చేసేవారు మాత్రం వ్యక్తిగత స్వార్థం కోసం కచ్చితమైన ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తారు. ఇది సమాజానికి, దేశానికి హాని కలిగిస్తుంది’’ అని జడ్జి స్పష్టం చేశారు. దోషులకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.75 వేల జరిమానా విధించారు.