కేంద్రం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పన్ను విధానానికి సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.1 లక్షకు పెంచాలని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ ఈవై డిజి ఇండియా తెలిపింది. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.3.5 లక్షలకు పెంచాలని కోరింది.
ఈవై తెలిపిన వివరాల ప్రకారం..ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి విధాన పరమైన ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించాలి. పన్ను విధానాలను క్రమబద్ధీకరించాలి. దేశీయంగా పెట్టుబడులు ఆకర్షించే వాతావరణాన్ని పెంపొందించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. కార్పొరేట్ పన్ను రేట్లను స్థిరంగా కొనసాగించాలి. టీడీఎస్ నిబంధనను మార్చాలి. వివాద పరిష్కారాలను సరళీకరించాలి. పన్ను మినహాయింపులు లేని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలి. రాయితీ పన్ను విధానంలో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచాలి. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు చేర్చాలి. ఐటీఆర్ ప్రాసెస్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దాన్ని మెరుగుపరిచేలా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) సేవలు వినియోగించుకోవాలి.
ఇదీ చదవండి: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ
‘టీడీఎస్‌ను హేతుబద్ధీకరించాలి. ప్రస్తుతం టీడీఎస్ కింద 33 విభాగాలు ఉన్నాయి. దాంతో పన్నుదారుల్లో చాలా గందరగోళం నెలకొంటుంది. వీటిలో 0.1 నుంచి 30 శాతం వరకు పన్ను రేట్లు ఉంటాయి. ఇందులోని విధానాలను సరళీకరించాలి’ అని ఈవై కన్సల్టెన్సీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment