న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులోని కీలక అంశాలపై మరింతగా సంప్రదింపులు జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు.
‘వినియోగదారులు, పరిశ్రమ, స్టార్టప్‌లు, లాయర్లు, న్యాయమూర్తులు, పౌరులు మొదలైన వర్గాలన్నింటి సంప్రదింపులతో రూపొందాలి. వారందరి అభిప్రాయాలకు ఆ చట్టాల్లో స్థానం లభించాలి. ప్రభుత్వం చేయబోతున్నది ఇదే‘ అని మంత్రి చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల నాటి ఐటీ చట్టం 2000 స్థానంలో డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment