![ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/7/06bng21a-120022_mr.jpg.webp?itok=XkvB-XDX)
ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు
కర్ణాటక: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ఆరంభం కాగా, బెంగళూరులో ఐటీ అధికారులు ముమ్మరంగా దాడులు చేశారు. శనివారం బెంగళూరులో శాంతినగర, కాక్స్‌టౌన్, శివాజీనగర, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్సన్, కన్నింగ్‌హ్యామ్ రోడ్డు, సదాశివనగర, కుమారపార్కు వెస్ట్, ఫేర్‌ఫీల్డ్ లేఔట్‌లో ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
ఇందులో రూ.15 కోట్లు నగదు, రూ.5 కోట్లు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏ అభ్యర్థులతో సంబంధాలు ఉన్నాయి అనే దానిపై విచారణ చేపట్టారు. మైసూరులో కూడా ఐటీ దాడులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment