ఆ వేధింపుల భయాల్ని తొలగించండి | Remove Fear Of Harassment Among Taxpayers, PM Modi Tells Tax Officials | Sakshi
Sakshi News home page

ఆ వేధింపుల భయాల్ని తొలగించండి

Published Thu, Jun 16 2016 3:16 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

ఆ వేధింపుల భయాల్ని తొలగించండి - Sakshi

ఆ వేధింపుల భయాల్ని తొలగించండి

న్యూఢిల్లీ : పన్ను ఓ పెనుభూతంలా భావించే పన్నుచెల్లింపుదారులకు ఆ భయాన్ని తొలగించాలని అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. పన్ను చెల్లింపుదారుల మైండ్ లోంచి ఆ వేధింపుల భయాన్ని తుడిచివేయాలని సూచించారు. పరిపాలనలో ఐదు పిల్లర్స్ గా ఉన్న రెవెన్యూ, అకౌంటబిలిటీ, ప్రొబిటీ, ఇన్ ఫర్మేషన్, డిజిటైజేషన్ పై ఎక్కువగా దృష్టిసారించాలని పేర్కొన్నారు. రెండు రోజుల  'రాజస్వ జ్ఞాన సంఘం'  సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

పన్నుల విధానంలో  డిజిటైజేషన్ పై అధికారులు ఎక్కువగా దృష్టిపెట్టి, పన్నుల పరిపాలనను మంచిగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు.  పన్ను వేధింపుల భయాన్ని పోగొట్టినప్పుడే పన్ను చెల్లింపుదారుల ప్రవర్తన మృదువుగా, తెలివిగా ఉంటుందని అధికారులకు మోదీ సూచించారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ సమావేశ అనంతరం వివరాలను జయంత్ సిన్హా మీడియాకు వెల్లడించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు , కేంద్ర ఎక్సేంజ్, కస్టమ్స్ బోర్డు సీనియర్ పన్ను అధికారులు ఈ రెండు రోజుల వార్షిక కాన్ఫరెన్స్ కు పాల్గొంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement