న్యూఢిల్లీ: ఏటీ–1 బాండ్ల తప్పుడు విక్రయాల కేసుకు సంబంధించి రూ. 2.22 కోట్లు కట్టాలంటూ యస్ బ్యాంక్ మాజీ ఎండీ రాణా కపూర్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించని పక్షంలో అరెస్ట్ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అలాగే అసెట్స్, బ్యాంక్ ఖాతాలను కూడా అటాచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్‌ల గురించి చెప్పకుండా వాటిని అమాయక ఇన్వెస్టర్లకు యస్ బ్యాంక్ సిబ్బంది అంటగట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2022 సెపె్టంబర్‌లో రాణా కపూర్‌కు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment