మెల్‌బోర్న్: స్వలింగ వివాహాలకు ఇటీవల రూపొందించిన బిల్లు సభలో కార్యరూపం దాల్చడంతో ఆస్ట్రేలియాలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో లారెన్ ప్రైస్, అమీ లేకర్‌లు శనివారం తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో లెస్బియన్ మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా లారెన్ ప్రైస్, అమీ లేకర్‌ల పేరు ఆస్ట్రేలియాలో మార్మోగి పోతోంది.
సిడ్నీకి చెందిన ఈ జంట గత కొంతకాలం నుంచి పెళ్లి గురించి ఆలోచిస్తుంది. కాగా, స్వలింగ వివాహాలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో వీరికి చట్టపరంగా మార్గం సుగమమైంది. దీంతో అధికారులకు సమాచారమిచ్చిన లారెన్ ప్రైస్, అమీ లేకర్‌లు అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని నూతన విధానాలకు నాంది పలికారు. మరోవైపు మెల్‌బోర్న్‌కు చెందిన ఎమీ, ఇలైస్ మెక్‌డొనాల్డ్ లు అధికారికంగా గే మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలు స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించగా, అందులో 16 దేశాలు యూరప్‌లోనే ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment