lesbian wedding
-
హవ్వా! అక్కడ మహిళలను మహిళలే పెళ్లాడతారు.. ఎందుకంటే?
సాధారణంగా పెళ్లీడుకు వచ్చిన అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేస్తారు. కానీ ప్రేమ అనేది ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడేదే కాదు.. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చని ఇటీవల జరుగుతున్న స్వలింగ సంపర్కుల వివాహాలు నిరూపిస్తున్నాయి. ధైర్యం చేసి, సమాజంలోని మూస పద్దతులను బద్దలు కొట్టి చాలా మంది స్వలింగ సంపర్కులు ఒకటవుతున్నారు. విదేశాల్లో ఎక్కువగా చూసే ఇలాంటి పెళ్లిళ్లు ప్రస్తుతం భారత్‌లోనూ అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.. అయితే కర్నాటకకు చెందిన ఒక గిరిజన కమ్యూనిటీ మాత్రం చాలా కాలంగా మహిళలు మహిళలనే పెళ్లి చేసుకోవడం (లెస్బియన్ మ్యారేజ్) మతపరమైన విశ్వాసంగా అనుసరిస్తుంది. అయితే ఈ పద్దతి ఎప్పుడు ఎలా మొదలైందో ఇప్పటి వారికీ తెలియదు. ఇద్దరు ఆడవాళ్లు చేసుకునే ఈ పెళ్లిని దద్దువే మదువే (దద్దువే వెడ్డింగ్) అని పిలుస్తారు. ఈ వివాహాన్ని కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హలక్కీ వొక్కలిగ వర్గంలో ఘనంగా జరుపుకుంటారు. ఇద్దరు ఆడవాళ్లు చీర కట్టుకొని.. ఒకరు వరుడిగా మరొకరు వధువుగా ముస్తాబవుతారు. చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు సాధారణ పెళ్లిళ్లలాగే అన్ని ఆచారాలను పాటిస్తారు. ఊరేగింపుగా తీసుకు రావడం, పూజలు చేయడం, నూతన వధూవరులను అందరూ ఆశీర్వదించడం అన్నీ అచ్చం మామూలు పెళ్లిలాగే ఉంటాయి. అంతేనా.. పెళ్లికి వచ్చిన అతిథులు బహుమతులు కూడా తీసుకొస్తారు. పెళ్లిలో సంగీతం, డ్యాన్స్‌లు ఉంటాయి. ఇక వచ్చిన గెస్ట్‌లకు మంచి రుచికరమైన విందు వడ్డిస్తారండోయ్. తాజాగా అలాంటి దద్దువే మదువే వివాహం ఒకటి కర్కివినాయక, కరియమ్మ దేవాలయంలో జరిగింది. హలక్కీ తెగలో ఈ దేవతలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పెళ్లిలో ఎంతో సరదా కూడా ఉంటుంది. నూతన వధూవరుల మెడలో చిప్స్ ప్యాకెట్ల దండలు వేసి, వారి చుట్టూ అతిథులు డ్యాన్స్ చేస్తారు. చివరికి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ(పెళ్లి చేసుకున్న ఇద్దరు ఆడవాళ్లతో సహా) వారి ఇళ్లకు తిరిగి వెళ్తారు. అంటే ఇప్పటికే మీకు సీన్ అంతా అర్థమయి పోయి ఉండాలి. ఇది నిజమైన పెళ్లిలా జరుపుకునే మాక్ వెడ్డింగ్ అన్నమాట. అయితే ఇలా ఊరికే పెళ్లిళ్లు చేయరట.. దీని వెనక ఓ కారణం ఉందని చెబుతున్నారు సదరు గ్రామస్తులు. వర్షాలు కురువాలని ఇంద్రుడిని ప్రార్థిస్తూ ఈ స్వలింగ వివాహాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారట. హలక్కీ తెగ వాళ్లు వర్షాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. గౌరవిస్తారు. అందుకే ప్రతి ఏడాది ఈ మాక్ వెడ్డింగ్ ఆచారాన్ని జరుపుకుంటారు. అంతేగాక వర్షాలు అవసరానికి మించి కురవకూడదని కూడా వీళ్లు ఇలా వేడుకుంటారు. -
ప్రేమించుకున్న అమ్మాయిలు.. పెళ్లి చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు, ట్విస్ట్ ఏంటంటే?
పెళ్లి అంటే సాధారణంగా ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి కలిసి చేసుకునే వేడుక. ఇదే మనకు ఎక్కువగా తెలిసిన పెళ్లి. కానీ ఇద్దరు అమ్మాయిలు.. లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వలింగ వివాహాలను ప్రభుత్వాలు ఆమోదించాయి. వీటిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియయా, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం, కెనడా, కొలంబియా, స్పెయిన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడన్, పోర్చుగల్, ఐర్లాండ్, మెక్సికో, డెన్మార్క్, ఉరుగ్వే ఉన్నాయి. స్వలింగ వివాహాలు విదేశాల్లో సహజమే అయినా.. భారత్‌లో మాత్రం విచిత్రంగానే పరిగణిస్తారు. అంతేగాక సమాజం, తల్లిదండ్రులు కూడా ఇలాంటి పెళ్లిళ్లను వ్యతిరేకిస్తారు. అయితే తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్బాద్లో చోటుచేసుకుంది. జోరఖ్పుల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జామాడోబాలో ఉంటున్న రాఖిమిర్ధా (24), కరిష్మా రావత్ (23) ఇద్దరు స్నేహితులు. వీరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాము ప్రేమించుకుంటున్నామని, జీవితాంతం కలుసుండాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి స్టేషన్‌కు పిలించారు. స్టేషన్‌కు వెళ్లిన ఇరు కుటుంబసభ్యులు వారి నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఎన్నో గంటల పాటు సర్దిచెప్పడంతో తమ తమ ఇళ్లకు వెళ్లడానికి ఆ అమ్మాయిలు ఒప్పుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. -
పెళ్లిచేసుకున్న ఇండో-పాక్ యువతులు
వాషింగ్టన్: సరిహద్దులను చెరిపేసేది.. మతం అడ్డును తొలగించేది.. లింగ బేధాలను ధిక్కరించేది ప్రేమ. అయితే అది కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య మాత్రమే అనుకుంటే పొరపాటు. ఒకే జెండర్ ఉన్న వాళ్లూ ప్రేమలో పడొచ్చు. కేవలం ప్రేమకే పరిమితం కాకుండా వివాహం కూడా చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి వివాహాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఇద్దరు యువతులు చేరారు. వీరిద్దరు కూడా ఇండియా, పాక్‌కు చెందిన వారు కావడం గమనార్హం. భారత్‌కు చెందిన బియాంక, పాక్‌కు చెందిన సైమా.. కాలిఫోర్నియాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. కొలంబియన్-ఇండియన్ అయిన బియాంక మైలీ ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ముస్లిం యువతి సైమాను కలుసుకోవడం జరిగింది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. రెండు వేర్వేరు సంస్కృతులకు చెందిన వీరిద్దరు తాజాగా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహ వేడుక కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరిగింది. బంగారు రంగు భారీ ఎంబ్రాయిడరీ చీరలో బియాంక వధువుగా మెరవగా.. నల్లటి షెర్వానీలో సైమా వరుడిగా వేదిక మీదకు వచ్చారు. ‘నీ ప్రేమతో జీవితం మరింత సంతోషంగా మారింది’ అంటూ బియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీరి పెళ్లిని కొందరు వ్యతిరేకిస్తూ కామెంట్ చేయగా.. మరి కొందరు అందమైన జంట.. జీవితాంతం సంతోషంగా ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram Life is sweeter with you. 4.20.19 💍 Photos by @sennaahmad Outfits by @bhkazimov A post shared by 𝔩𝔞 𝔫𝔢𝔫𝔞 𝔡𝔢 𝔪𝔦𝔢𝔩 🇨🇴🇮🇳 (@biancamaieli) on Aug 25, 2019 at 6:43pm PDT నెల రోజుల క్రితం ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం ఆర్టిస్ట్ సుందాస్ మాలిక్, భారత్‌కు చెందిన హిందూ యువతి అంజలిలు ప్రేమించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోల ఇంటర్నెట్ను షేక్ చేశాయి. (చదవండి: ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్) -
భార్యభర్తలుగా మారిన ఇద్దరు మహిళలు
చెన్నై , అన్నానగర్ : మధురై సమీపంలో ఓ యువతి తన స్నేహితురాలిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ దంపతులుగా మారి గురువారం రామనాథపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వద్ద తమ సమస్యను విన్నవించుకున్నారు. మధురైకి చెందిన నవ దంపతులు జాయ్సన్ జ్యోష్వా, సుకన్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కాగా సుకన్యకు ముందే వివాహం అయింది. అయినప్పటికీ వీరిద్దరు వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ..‘‘నేను, బ్యూలా పాఠశాలలో చదువుతున్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్. కాలక్రమంలో ఇద్దరు కలసి జీవించాలని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాం. మా ఇంట్లోవారు తీవ్రంగా వ్యతిరేకించి ఇద్దరినీ విడదీశారు. 2012లో నన్ను రామనాథపురానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అనంతరం నాకు ఓ ఆడ బిడ్డ పుట్టింది. ఈ స్థితిలో నా భర్త ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నన్ను బాధించింది. దీంతో విరక్తి చెందిన నేను నా పాత స్నేహితురాలైన బ్యూలాని కలుసుకుని నా పరిస్థితిని వివరించాను. తరువాత ఇద్దరు మళ్లీ కలసి జీవించాలని సిద్ధమయ్యాం. ఇందుకోసం మూడు నెలలకు ముందు బ్యూలా పుదువైకి వెళ్లి ఆపరేషన్ చేయించుకుంది. తరువాత ఆమె పురుషుడిలా మారి జాయ్సన్ జ్యోష్వా అని పేరు మార్చుకున్నాడు. తరువాత మధురైలో ఉన్న ప్రైవేట్ షాపింగ్ మాల్లో నేను, జాయ్సన్ సెక్యూరిటీగా పని చేస్తున్నాం. మేము భార్యభర్తలుగా సంతోషంగా కాపురం చేస్తున్నాం. అయితే నా బిడ్డని నేనే పెంచుకుంటా. నా మొదటి భర్త దగ్గర నుంచి నా బిడ్డను ఇప్పించాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మమ్మల్ని కొందరు విడదీయాలని చూసినా కాలం మమ్మల్ని కలిపింది. నా ఆరేళ్ల కుమార్తె నాకు కావాలి. ఆమెని మేము బాగా పెంచుతాం’ అని సుకన్య తెలిపింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కోర్టుకు వెళ్లి చట్టం ప్రకారం బిడ్డను పొందాలని పోలీసులు సూచించారు. -
సేమ్ సెక్స్ మ్యారేజ్.. మహిళా జోడీ కొత్త చరిత్ర
-
సేమ్ సెక్స్ మ్యారేజ్.. మహిళా జోడీ కొత్త చరిత్ర
మెల్బోర్న్: స్వలింగ వివాహాలకు ఇటీవల రూపొందించిన బిల్లు సభలో కార్యరూపం దాల్చడంతో ఆస్ట్రేలియాలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో లారెన్ ప్రైస్, అమీ లేకర్లు శనివారం తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో లెస్బియన్ మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా లారెన్ ప్రైస్, అమీ లేకర్ల పేరు ఆస్ట్రేలియాలో మార్మోగి పోతోంది. సిడ్నీకి చెందిన ఈ జంట గత కొంతకాలం నుంచి పెళ్లి గురించి ఆలోచిస్తుంది. కాగా, స్వలింగ వివాహాలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో వీరికి చట్టపరంగా మార్గం సుగమమైంది. దీంతో అధికారులకు సమాచారమిచ్చిన లారెన్ ప్రైస్, అమీ లేకర్లు అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని నూతన విధానాలకు నాంది పలికారు. మరోవైపు మెల్బోర్న్కు చెందిన ఎమీ, ఇలైస్ మెక్‌డొనాల్డ్ లు అధికారికంగా గే మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలు స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించగా, అందులో 16 దేశాలు యూరప్‌లోనే ఉండటం గమనార్హం. -
లండన్‌లో తొలి లెస్బియన్ వివాహం
లండన్: ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇందులో కొత్తేం ఉంది అనుకుంటున్నారా.. కానీ వీరు పెళ్లి చేసుకుంది లండన్‌లో. అంతే కాదుయూకేలో ఇదే తొలి మతాంతర వివాహం అంట. వీరిలో ఒకరు హిందూ కాగా, మరొకరు యూదు జాతీయురాలు. లండన్‌కు చెందిన కళావతి మిస్త్రీ(48), టెక్సాస్‌కు చెందిన మిరియం జెఫర్సన్ అనే ఇద్దరు ఇరవై ఏళ్ల క్రితం యూఎస్‌లోని టెక్సాస్‌లో అనుకోకుండా కలుసుకున్నారు. అలా వీరి మధ్య చిగురించిన స్నేహం అప్పటి నుంచి కొనసాగుతోంది. యుక్త వయస్సు వచ్చాక తను స్వలింగ సంపర్కులిరాలినన్న విషయం తెలుసుకున్నానని, అయితే కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆ విషయం చెప్పటానికి చాలా కాలం భయపడ్డానని కళావతి తెలిపింది. స్నేహితురాలైన మిరియం కూడా లెస్బియన్ కావటంతో ఇద్దరూ ఒక్కటయ్యేందుకు అంగీకారం కుదిరిందని, తమ వివాహానికి రెండు కుటుంబాలు మనస్పూర్తిగా అంగీకరించాయని కళావతి తెలిపింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియోలో యూదు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. గత వారం వీరు హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. స్థానిక హిందూ మహిళా పూజారి చందావ్యాస్ వీరి వివాహ తంతును జరిపించారు. మంగళసూత్రం కూడా కట్టించారు. అనంతరం లీసెస్టర్ నగరంలోని చెట్నీ ఐవీ రెస్టారెంట్లో వివాహ విందు ఏర్పాటు చేశారు. వివాహానంతరం ఈ జంట తిరిగి అమెరికా వెళ్లిపోయింది.