వాషింగ్టన్: సరిహద్దులను చెరిపేసేది.. మతం అడ్డును తొలగించేది.. లింగ బేధాలను ధిక్కరించేది ప్రేమ. అయితే అది కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య మాత్రమే అనుకుంటే పొరపాటు. ఒకే జెండర్ ఉన్న వాళ్లూ ప్రేమలో పడొచ్చు. కేవలం ప్రేమకే పరిమితం కాకుండా వివాహం కూడా చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి వివాహాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఇద్దరు యువతులు చేరారు. వీరిద్దరు కూడా ఇండియా, పాక్‌కు చెందిన వారు కావడం గమనార్హం. భారత్‌కు చెందిన బియాంక, పాక్‌కు చెందిన సైమా.. కాలిఫోర్నియాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. కొలంబియన్-ఇండియన్ అయిన బియాంక మైలీ ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ముస్లిం యువతి సైమాను కలుసుకోవడం జరిగింది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
రెండు వేర్వేరు సంస్కృతులకు చెందిన వీరిద్దరు తాజాగా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహ వేడుక కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరిగింది. బంగారు రంగు భారీ ఎంబ్రాయిడరీ చీరలో బియాంక వధువుగా మెరవగా.. నల్లటి షెర్వానీలో సైమా వరుడిగా వేదిక మీదకు వచ్చారు. ‘నీ ప్రేమతో జీవితం మరింత సంతోషంగా మారింది’ అంటూ బియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీరి పెళ్లిని కొందరు వ్యతిరేకిస్తూ కామెంట్ చేయగా.. మరి కొందరు అందమైన జంట.. జీవితాంతం సంతోషంగా ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
నెల రోజుల క్రితం ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం ఆర్టిస్ట్ సుందాస్ మాలిక్, భారత్‌కు చెందిన హిందూ యువతి అంజలిలు ప్రేమించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోల ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. (చదవండి: ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్)
Comments
Please login to add a commentAdd a comment