అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతూరు ఇవాంక ట్రంప్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ట్రంప్ భారత్ పర్యటనలో ఇవాంక కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆమె రాకకోసం ఎంతోమంది అభిమానులు కళ్లుకాసేలా ఎదురుచూశారు. తమ అభిమాన ఇవాంకను ఒక్కసారి కళ్లారా చూసి.. ఒక్క సెల్ఫీ తీసుకోవాలని ఎంతోమంది ఆశపడి ఉంటారు. కొంతమంది ఆ అవకాశం దొరికినా.. చాలా మందికి మాత్రం నిరాశే మిగిలింది. అయితే వారంత అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుని, ఉన్న తెలివితో ఇవాంకతో సెల్ఫీ తీసుకున్నట్లు ఫోటోలను ఎడిట్ చేసి మురిసిపోతున్నారు. (అందరి చూపులు ఆమె వైపే..!)
దీనిలో భాగంగానే ఓ కుర్రవాడు ఇవాంక ట్రంప్ను చూసి మనసు పారేసుకున్నాడు. తన సైకిల్‌పై ఎక్కించుకుని తిప్పాలని అనుకున్నాడు. అయితే అది కుదరకపోవడంతో ఎడిటింగ్‌లో తన సైకిల్‌పై ఇవాంకను ఎక్కించుకున్నట్లుగా చేసుకుని సరదా తీర్చుకున్నాడు.
మరోకరు ఆమెతో తాజ్‌మహాల్ వద్ద పక్కపక్కన కూర్చోని ఉన్నట్లు ఫోటోను ఎడిట్ చేశారు. ఈయన ఎవరో కాదు ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసంజ్. ఇలాంటివి ఎన్నో చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో తన దృష్టికి వచ్చిన పలు ఫోటోలపై ఇవాంక సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారతీయుల అభిమానాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ బదులిస్తున్నారు. (తాజ్ అందాలకు ఇవాంక ఫిదా!)
వైరల్‌గా మారిన ఇవాంక ఎడిట్ పిక్స్
Published Sun, Mar 1 2020 7:58 PM | Last Updated on Sun, Mar 1 2020 8:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment