సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్లకు క్షమాపణ చెప్పింది. లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ స్టెలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో జూన్ 30వ తేదీన ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో స్వలింగ సంపర్కులైన ఇద్దరు పురుషులు(జోర్డాన్, లుకాలు) లిప్ కిస్ చేసుకుంటున్నారు. ఇంగ్లాడ్‌కు చెందిన ఓ మ్యాగజైన్ కోసం జోర్డాన్, లుకాలు ఆ విధమైన స్టిల్స్ ఇచ్చారు. కాగా తమ నియమ, నిబంధనలకు ఈ ఫొటో వ్యతిరేకంగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫొటోను తొలగించింది.
గత కొంత కాలంగా మోడ్రన్ రిలేషన్స్‌పై పోస్ట్‌లు చేస్తున్న స్టెలా.. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఉంచిన ఫొటోను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎలా నిబంధనల ప్రకారం లేదో చెప్పాలంటూ ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులను ప్రశ్నించారు. స్వలింగ సంపర్కాన్ని మీరు నేరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లదలుచుకున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఆ ఫొటోలోని జోర్డాన్, లుకాలు కూడా ఇన్‌స్టాగ్రామ్ చర్యపై మండిపడ్డారు. దీనిపై వెనక్కి తగిన ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులు ఈ ఫొటో పొరపాటున తొలగించినందుకు క్షమాపణలు చెప్పారు. అలాగే ఫొటోను తిరిగి పోస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment