ఆస్పత్రులపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు | FIR Within 6 Hours If Doctors Face Violence: Centre's Directive To Hospitals On Attacks | Sakshi
Sakshi News home page

ఆసుపత్రి సిబ్బందిపై దాడి.. ఆరు గంటల్లోగా కేసు పెట్టాలి: కేంద్రం ఆదేశం

Published Fri, Aug 16 2024 2:58 PM | Last Updated on Fri, Aug 16 2024 3:53 PM

FIR Within 6 Hours if doctors face violence: Centre's Directive To Hospitals

న్యూఢిల్లీ: బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం.. అన్నీ అసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి వైద్యులపై, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగితే.. ఆరు గంటల్లోగా పోలీసు కేసు కావాల్సిందేని పేర్కొంటూ..  అన్ని ఆసుపత్రులకు మెమో జారీ చేసింది.  

ఒకవేళ నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ అధిపతి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఎక్కువైనట్లు మా దృష్టికి వచ్చింది. అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు తమ విధి నిర్వహణలో శారీరక హింసకు గురవుతున్నారు. మరికొందరికి  బెదిరింపులు, వస్తున్నాయి.

ఇందులో ఎక్కువ శాతం రోగి, వారి వెంట వచ్చిన అటెండర్ల వల్ల ఎదుర్కొన్నవే.. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసను ఎదుర్కొంటే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని కేంద్రం వెల్లడించింది. 

కాగా కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే వారికి మెరుగైన రక్షణ, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని  కోరుతూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్ధులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement