కోల్‌కతా: కోల్‌కతా న్యూరోసైన్స్ హాస్పిటల్‌లో ఓ రోగి హల్‌చల్ చేశాడు. రెండు గంటల పాటు అందర్నీ పరుగులు పెట్టించి, చివరికి బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ హాస్పిటల్‌లో సుజిత్ అనే పేషెంట్ తన బెడ్ నుంచి తప్పించుకుని ఆస్పత్రి భవనం ఏడవ అంతస్తులోని ఓ గోడ అంచున కూర్చుని దూకేస్తానంటూ రెండు గంటలు పాటు హంగామా చేశాడు. ఆ పేషంట్ చికిత్స తాను పొందుతున్న వార్డులోని గ్లాస్ కిటికీలోని గ్యాప్ ద్వారా తప్పించుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నాడు.
ఆసుపత్రి ఉద్యోగులు, అగ్నిమాపక దళం సిబ్బంది పేషంట్‌ని వార్డుకు తిరిగి రావాలని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పేషంట్‌ని కాపాడేందుకు హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో సిబ్బంది కిందకు దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరికి ఆస్పత్రి సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. దీంతో అతని పుర్రె, పక్కటెముక, ఎడమ చేయి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేషంట్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్‌లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు
Comments
Please login to add a commentAdd a comment