ఒక మారుమూల ప్రాంతంలోని రోగి కోసం ఏకంగా తన్న ప్రత్యేక హెలికాప్టర్‌ని నింపి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు హిమచల్ ముఖ్యమంత్రి. తన పర్యటను సైతం రద్దు చేసుకుని మరీ హెలికాప్టర్‌ని పంపారు. చంబా జిల్లాలోని పాంగి సబ్‌డివిజన్‌లో కిల్లార్‌లో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. అతను ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న హిమచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించడం కోసం ఆ ప్రాంతానికి హెలికాప్టర్‌ని పంపారు. అతనిని తండా వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంతేగాదు అతనికి ఉచితంగా వైద్యం అందించడమే గాక అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి సదరు ఆస్పత్రి అధికారులను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. వైద్య సదుపాయం లేని ఆ సుదూర ప్రాంతానికి తన అధికారిక చాపర్‌ని పంపడం కోసం ముఖ్యమంత్రి తన పర్యటనను సైతం రద్దు చేసుకున్నట్లు అధికారుల పేర్కొన్నారు.
అంతేగాదు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు సరైన వైద్యం అందేలా ఆ ప్రాంతంలో తగినంత మంది వైద్యులను నియమిస్తామని కూడా చెప్పారు. దీంతో ఆ పేషెంట్ సోదరుడు ప్రీతమ్ లాల్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ..మా కుటుంబాన్ని రక్షించే దేవుడు అని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌ని కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment