కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గుండె పోటు రావడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని సీనియర్ సీపీఐ(ఎమ్) నాయకుడు అశోక్ భట్టాచార్యా అభిప్రాయపడ్డారు. కొన్ని పార్టీలు గంగూలీ క్రేజ్‌ను వాడుకోవడానికి యత్నిస్తున్నాయని, ఈ క్రమంలోనే అతను ఒత్తిడికి గురై గుండెపోటుకు గురైనట్లు ఆరోపించారు. ‘ కొన్ని పార్టీలు గంగూలీని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయి. అది కచ్చితంగా గంగూలీపై ఒత్తిడి తేవడమే. (సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!)
అతనేమీ పొలిటికల్ లీడర్ కాదు. గంగూలీని ఒక స్పోర్ట్స్ ఐకాన్‌గా మాత్రమే మనం గుర్తుంచుకోవాలి’ అని గంగూలీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భట్టాచార్యా పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీని పరామర్శించడానికి వెళ్లిన భట్టాచార్యా మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కొన్ని పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా కూడా గంగూలీని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేయవద్దని హితవు పలికారు. గతవారమే గంగూలీతో రాజకీయాల్లో జాయిన్ అవుతున్నారా అనే విషయాన్నిఅడిగితే.. అదేమీ లేదని తేల్చిచెప్పాడని, అటువంటి సమయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఉదయం తన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గంగూలీకి గుండెపోటుకు గురయ్యారు. దీంతో సౌరవ్‌ను హుటాహుటిన ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. సౌరవ్‌కు గుండెపోటుగా వైద్యులు నిర్దారించిన తర్వాత యాంజియో ప్లాస్టీ చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment