
Hanband Plans To Murder Wife For Buying Smart Phone: కోల్‌కతా: అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్ కొన్నందుకు తన భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు ఓ కిరాతక భర్త. అందుకు కాంట్రాక్ట్ కిల్లర్స్ ని కూడా నియమించాడు. అదృష్టవశాత్తు ఆ మహిళ ఈ ప్రమాదం నుంచి బయట పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో జరిగింది. వివరాల ప్రకారం.. ఓ మహిళ కొన్ని నెలల క్రితం తన భర్తను స్మార్ట్‌ఫోన్ కొనమని కోరింది.
అయితే అతను కొనేందుకు నిరాకరించాడు. ట్యూషన్ తరగతులు చెబుతూ కొంత డబ్బు సంపాదిస్తున్న మహిళ జనవరి 1న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కోపంతో ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ వ్యక్తి ఇంటి మెయిన్ డోర్‌కు తాళం వేసి మహిళ భర్త వెళ్ళిపోయాడు. ఏదో తప్పుగా భావించిన మహిళ అతని కోసం వెతకుతున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావమైన మహిళ ఇంటి నుంచి పారిపోయి అరవడం ప్రారంబించింది. మహిళ అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. దుండగుల్లో ఒకరిని, భర్తను పట్టుకున్నారు. అయితే, మరో దుండగుడు తప్పించుకోగలిగాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు