‘ది డర్టీ పిక్చర్’‌ నటి అనుమానాస్పద మృతి | The Dirty Picture Actress Arya Banerjee Died At Her Home | Sakshi
Sakshi News home page

నటి ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి

Published Sat, Dec 12 2020 10:30 AM | Last Updated on Sat, Dec 12 2020 1:49 PM

The Dirty Picture Actress Arya Banerjee Died At Her Home - Sakshi

కోల్‌కతా: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్‌ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ‘ది డర్టీ పిక్చిర్’‌లో విద్యాబాలన్‌‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి గది లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే కొద్ది కాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగా జీవిస్తున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు తెలిపింది. దీంతో పనిమనిషి అందిచిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నటి మరణ వార్త తెలియడంతో బాలీవుడ్‌ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సోషల్‌ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి సిల్క్‌ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన‌ ‘ది డర్టీ పిక్చర్’‌లో షకీలా పాత్ర పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement