
సాక్షి, హైదరాబాద్ : ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. కోల్‌కతా కేంద్రంగా అరాచకాలు సాగిస్తున్న కేడీలను కటకటాల వెనక్కి పంపారు. కోల్‌కతాలోని ఆన్‌లైన్ డేటింగ్ కంపెనీపై హైదరాబాద్ పోలీసులు దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ జరిపి అందులో ముగ్గురిని అరెస్టు చేసి కలకత్తా కోర్టులో హాజరు పరిచారు. యువతి, యువకులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి ఈ ముఠా లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment