సాక్షి,హైదరాబాద్: సివిల్ సర్వీసు అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆదివారం మధ్యాహ్నమే 12 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం రాత్రి 8 గంటలకు 9 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.10 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లను బదిలీ చేసింది.
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవిని ప్రభుత్వం నియమించింది. వరంగల్ కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను హైదరాబాద్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్‌పై వేటు వేశారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావును నియమించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ ఎస్బీ హైదరాబాద్ డీసీపీగా బదిలీ అయ్యారు. నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్, పశ్చిమ మండల డీసీపీగా విజయ్‌కుమార్, ఉత్తర మండల డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీచదవండి..నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్: సీపీ శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment