
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదివారం(మే5) బదిలీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీజీపిని ఆదేశించింది. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కు ఆదేశాలు జారీ చేసింది.
కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌ను ఈసీ కోరింది. సోమవారం(మే6) ఉదయం 11 గంటల లోపు ప్రతిపాదనలు పంపాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment