పాఠశాల ఎదుట విలపిస్తున్న విద్యార్థులు
జయపురం(భువనేశ్వర్): సమాజంలో తల్లీ, తండ్రి, తరువాతి స్థానం గురువులదే. అటువంటి ఉన్నతమైన గురువులపై ఆరోపణలు చేసేవారే ప్రస్తుతం ఎక్కువ మంది తారస పడుతుంటారు. అయితే ఒక ఉపాధ్యాయుడిని బదిలీ చేసినందుకు ఆ పాఠశాలలోని విద్యార్థులంతా అన్న, పానీయాలు విడిచిన ఘటన సర్వత్రా ఆసక్తి రేపింది. వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు సైతం విలపించిన ఘటన నవరంగపూర్ జిల్లా డాబుగాం సమితి మెదన ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది.
పిల్లల ఆవేదనను తెలుసుకున్న డాబుగాం పంచాయతీ అధ్యక్షుడు వంశీధర మఝి, సర్పంచ్ దివాకర పూజారి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు సబితా కొలారి, గ్రామస్తులు ఉపాధ్యాయుడి బదిలీని రద్దు చేయాలని బ్లాక్ విద్యాధికారిని కోరారు, వివరాల్లోకి వెళ్తే... డాబుగాం సమితిలో కొద్ది రోజుల క్రితం 27 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో ఆరుగురిని ఎమ్మెల్యే అనుమతితో ఇతర సమితులకు బదిలీ చేశారు. వారిలో మెదన ఉన్నత పాఠశాలలో మెచ్‌ఎంగా పనిచేస్తున్న దివాకర బారిక్ ఒకరు. ఆయన గత 22 ఏళ్లుగా ఇదే పాఠశాలలో పని చేస్తున్నారు.
ఐదేళ్ల క్రితం ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది, అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. సమర్థవంతంగ సేవలందిస్తూ.. విద్యార్థుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని, వారి అభిమానానికి పాత్రుడయ్యారు. గుణాత్మకమైన విద్య అందించడం, క్రమశిక్షణ అలవరచడం, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటంలో అందరి మన్ననలు పొందారు. అటువంటి ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు తీరని ఆవేదనకు గురయ్యారు. తామంతా అభిమానించే ఉపాధ్యాయుడు వెళ్లిపోతున్నారని తెలిసిన బోరున విలపించారు. వెంటనే హెచ్‌ఎం దివాకర బారిక్ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
చదవండి: Gram Sarpanch: గ్రామ ప్రజల పాట.. 44 లక్షలకు సర్పంచ్ పదవి!
Comments
Please login to add a commentAdd a comment