11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇద్దరికి అదనపు బాధ్యతలు
రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి.. నల్లగొండ కలెక్టర్‌గా త్రిపాఠీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కమిషనర్‌గా శశాంక
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మేడ్చల్ జెడ్పీసీఈవో దిలీప్‌కుమార్
ఇద్దరు ఐఎఫ్‌ఎస్ అధికారులు కూడా బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రస్థాయి కమిషనర్లు, డైరె క్టర్లు, జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జాబి తాలో ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఐఎఫ్‌ఎస్ అధికా రులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని మళ్లీ పుర పాలక శాఖకు పంపారు. ఆమెను కమిషనర్ అండ్ డైరె క్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)గా బదిలీ చేస్తు న్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) స్పెషల్ కమిషనర్‌గా ఉన్న ఎం. హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఐఅండ్‌పీఆర్ బాధ్యతలను రెవెన్యూ జాయింట్ సెక్ర టరీ ఎస్.హరీశ్‌కు అప్పగించారు. ఆయనను ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా బది లీ చేసినప్పటికీ రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశాంకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులైన ఎస్.హరీశ్ సోమవారం ఆన్‌లైన్‌లో బాధ్యతలు స్వీకరించారు.
(వీరితో పాటు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తికి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా, హాకా ఎండీ కె. చంద్రశేఖర్‌రెడ్డికి పాడి అభివృద్ధి సమాఖ్య ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారిణి సోని బాలాదేవిని డైరెక్టర్, స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా పునర్నియమించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జెడ్పీ సీఈవోగా ఉన్న ఎస్.దిలీప్‌కుమార్‌ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. రాజన్న సర్కిల్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్‌గా ఉన్న అటవీశాఖ అధికారి జి.జ్ఞానేశ్వర్‌ను వికారాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)గా నియమించారు.)
Comments
Please login to add a commentAdd a comment