ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ ఫిర్యాదు
ఆయుష్ లో విడో సర్టిఫికెట్ చింపేసి బదిలీ నిలిపేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీల నుంచి కొంతమంది డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు పొందారని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబూరావు మంగళవారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ లాలూప్రసాద్ తదితరులు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీజీడీఏ) ఆఫీస్ బేరర్లమని చెప్పుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందారని, ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వుల ప్రకారం వీరు మినహాయింపులకు అర్హులు కారని బాబూరావు తెలిపారు.
పల్లం ప్రవీణ్ 19 ఏళ్లుగా, లాలూప్రసాద్ 12 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆరేళ్లకు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉన్నా.. అధికారులు వీరిని హైదరాబాద్ నుంచి కదపడం లేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. కాగా, ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో బదిలీలు చాలా అన్యాయంగా జరిగాయని పలువురు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకొని ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని పలువురు అభ్యర్థులు మండిపడుతున్నారు. ఒక డాక్టర్ తన భర్త చనిపోయినట్లు విడో ఆప్షన్ కింద దరఖాస్తు చేస్తే, విడో సరి్టఫికెట్ చింపేసి ఆమెను బదిలీ చేయకుండా నిలిపివేశారు. దీంతో ఆమె ఆయుష్ అధికారులను నిలదీయగా అసలు ఆ సర్టిఫికెట్ పెట్టలేదని బుకాయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్షలాది రూపాయలు లంచంగా తీసుకొని ఇష్టమైన వారికి నచి్చన చోట బదిలీ చేపట్టారని చెబుతున్నారు. అలాగే రీజనల్ డైరెక్టర్ పోస్టును అర్హులకు కాకుండా ఇతరులకు ఇచి్చనట్లు ఒక డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment