నిజామాబాద్ : ఏసీపీ వెంకటేశ్వర్ ఆకస్మిక బదిలీ రాజకీయ రంగు పులుముకుంది. రెండేళ్లు పూర్తి కాకుండానే బదిలీ జరగడం నగరంలో హాట్‌టాఫిక్ మారింది. ఏసీపీ నిజామా బాద్‌లో ఏడాదిన్నరకు పైగా పని చేశారు. ఏసీపీగా వచ్చిన వెంకటేశ్వర్ సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందుతూనే ప్రజలతో సంత్సంబంధాలు కొనసాగించారు. నిజామాబాద్ డివిజన్ నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. అయితే అధికారు లు తప్పనిసరిగా ఇక్కడి ప్రజాప్రతినిధుల కన్నుసన్న ల్లో పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో పాటు మరో ప్రజాప్రతినిధి కలిసి ఏసీపీ బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఎడమోహం పెడమోహంగా ఉన్న సదరు ఇద్దరు ప్రజాప్రతినిధులు చివరకు ఒక్కట య్యారు. తమ మధ్య విబేధాలను పక్కన పెట్టారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా వారిద్దరు ఒక్కటై చివరికి ఏసీపీ బదిలీకి చక్రం తిప్పినట్లు సమాచారం.
రెండు నెలలుగా అంతర్గత చర్చ..
ఏసీపీని బదిలీ చేయాలని రెండు నెలల నుంచి ప్ర జాప్రతినిధులు భావించినట్లు తెలిసింది. తమకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఏసీపీ పనులు చేస్తున్నా రని కొందరు ప్రజాప్రతినిధులు భావించి ఆయన ను బదిలీ చేయించాలని ఓ ప్రజాప్రతినిధికి లేఖలు రాసినట్లు సమాచారం. ఈ లేఖలను ఆధారంగా చేసుకుని ఓ పోలీస్ అధికారి అభిప్రాయం మేరకు ఏసీపీ బదిలీ జరిగినట్లు తెలిసింది. రెండు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి తెలంగాణవ్యాప్తంగా 16 మంది ఏసీపీలు, డీఎస్పీల బదిలీలో ఏసీపీ పేరుండడం నగర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీని ఆపాలని సదరు ఏసీపీ ఎవరి వద్దకు వెళ్లలేదని తెలిసింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
ఎన్నికల కోసమేనా..?
ఎక్కుడగా లాంగ్‌స్టాండింగ్ ఉన్న అధికారులను బ దిలీ చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండాలనే ఇద్దరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో పదినెలల కాలం ఉన్నప్పటికీ తమకు అనుకూలంగా ఉండే వారిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఏసీపీ బదిలీ జరిగినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment