venkateswara
-
‘బాబుతో మాట్లాడతా.. పేకాట ఆడిస్తా..’!
సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలుఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు. -
బదిలీ వెనుక రాజకీయం.. చక్రం తిప్పిన ఇద్దరు ప్రజాప్రతినిధులు..?
నిజామాబాద్ : ఏసీపీ వెంకటేశ్వర్ ఆకస్మిక బదిలీ రాజకీయ రంగు పులుముకుంది. రెండేళ్లు పూర్తి కాకుండానే బదిలీ జరగడం నగరంలో హాట్టాఫిక్ మారింది. ఏసీపీ నిజామా బాద్‌లో ఏడాదిన్నరకు పైగా పని చేశారు. ఏసీపీగా వచ్చిన వెంకటేశ్వర్ సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందుతూనే ప్రజలతో సంత్సంబంధాలు కొనసాగించారు. నిజామాబాద్ డివిజన్ నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. అయితే అధికారు లు తప్పనిసరిగా ఇక్కడి ప్రజాప్రతినిధుల కన్నుసన్న ల్లో పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో పాటు మరో ప్రజాప్రతినిధి కలిసి ఏసీపీ బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఎడమోహం పెడమోహంగా ఉన్న సదరు ఇద్దరు ప్రజాప్రతినిధులు చివరకు ఒక్కట య్యారు. తమ మధ్య విబేధాలను పక్కన పెట్టారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్లుగా వారిద్దరు ఒక్కటై చివరికి ఏసీపీ బదిలీకి చక్రం తిప్పినట్లు సమాచారం. రెండు నెలలుగా అంతర్గత చర్చ.. ఏసీపీని బదిలీ చేయాలని రెండు నెలల నుంచి ప్ర జాప్రతినిధులు భావించినట్లు తెలిసింది. తమకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఏసీపీ పనులు చేస్తున్నా రని కొందరు ప్రజాప్రతినిధులు భావించి ఆయన ను బదిలీ చేయించాలని ఓ ప్రజాప్రతినిధికి లేఖలు రాసినట్లు సమాచారం. ఈ లేఖలను ఆధారంగా చేసుకుని ఓ పోలీస్ అధికారి అభిప్రాయం మేరకు ఏసీపీ బదిలీ జరిగినట్లు తెలిసింది. రెండు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి తెలంగాణవ్యాప్తంగా 16 మంది ఏసీపీలు, డీఎస్పీల బదిలీలో ఏసీపీ పేరుండడం నగర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీని ఆపాలని సదరు ఏసీపీ ఎవరి వద్దకు వెళ్లలేదని తెలిసింది. రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్నికల కోసమేనా..? ఎక్కుడగా లాంగ్‌స్టాండింగ్ ఉన్న అధికారులను బ దిలీ చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండాలనే ఇద్దరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో పదినెలల కాలం ఉన్నప్పటికీ తమకు అనుకూలంగా ఉండే వారిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఏసీపీ బదిలీ జరిగినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
అమెరికాలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. యూఎస్ఏ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వామి వారి కళ్యాణం తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకుల చేతుల మీదుగా సంప్రదాయ బద్ధంగా జరిగింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించగా..ప్రముఖ గాయని శోభారాజు తన గానంతో భక్తుల్ని అలరించారు. ఈ కార్యకార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్, కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు, కిరణ్ పోశామ్, ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల,హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్, వైఎస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి వల్లూరి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చి అనంత లోకాలకు..
ద్వారకాతిరుమల/ఆకివీడు: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారా దర్శనం నిమిత్తం క్యూలైన్లో నిలుచున్న భక్తుడికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఆకివీడుకు చెందిన లారీ యజమాని రెడ్డి జగదీశ్వరరావు (54), భార్య, ముగ్గురు కుమారులతో కలిసి ఉదయం చినవెంకన్న క్షేత్రానికి వచ్చారు. దర్శనం నిమిత్తం క్యూలైన్లో వేచి ఉండగా జగదీశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు, కొందరు భక్తులు ఆయన్ను హుటాహుటిన ద్వారకాతిరుమల ప్రాథమిక ఆ రోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే జగదీశ్వరరావు మృతి చెం దినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆకివీడులోని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలిపారు. -
కాళ్లకూరు వెంకన్న హుండీ ఆదాయం రూ.11.39 లక్షలు
కాళ్ల: కాళ్ల మండలం కాళ్లకూరులో స్వయంభువు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హు ండీ ఆదాయాన్ని సోమవారం లెక్కిం చారు. 60 రోజులకు రూ.11,39,363 ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 2.67 గ్రాముల బంగారం, 65 గ్రాముల వెండి లభించిందన్నారు. ఆచంట రామేశ్వరస్వామి ఆలయ ఈవో జీవీ కృష్ణంరాజు, ఆలయ చైర్మన్ అడ్డాల వెంకగణపతిరాజు, ధర్మకర్తలు, సర్పంచ్ అడ్డాల శివరామరాజు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు -
అంగరంగ వైభవం.. శ్రీనివాసుని కల్యాణం
కరీంనగర్‌కల్చరల్: శ్రీవేంకటేశ్వరస్వామి తిరు కల్యాణోత్సవం ఆదివారం రాత్రి నగరంలోని వైశ్యభవన్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీత్రిదండి చిన్నజీయర్‌స్వామి మంగళ శాసనాలతో శ్రీదేవనాథ జీయర్‌స్వామి పర్యవేక్షణలో పండితులు శ్రీపాంచరాత్ర దివ్యాగ మోక్షం ప్రకారం శ్రీనివాసుని కల్యాణాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దంపతులకు స్వామివారి శంఖుచక్ర నామ సహిత శేషవస్త్రాలు, స్వామివారి డాలర్, తిరుపతి లడ్డూప్రసాదం అందజేశారు. శ్రీపద్మనాభ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో సంగీత దర్శకుడు కేబీ శర్మ బృందం ఆలకించిన ఏడు కొండల వారి కీర్తనలు, పాటలు అలరించాయి. -
రష్యన్ భక్తుల గోవిందా.. గోవింద
-
అక్కను కొట్టొద్దన్నందుకు..
ఒంగోలు క్రైం : అక్కను కొట్టొద్దని అడ్డు పడిన బావమరిదిని బావ గొంతు నులిమి చంపాడు. ఈ సంఘటన నగరంలోని అగ్రహారం గేటు అవతల ఉన్న బాలాజీనగర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. బాలాజీనగర్‌లో పామూరి రాజేశ్వరి, వెంకటేశ్వర్లు దంపతులు గొడవపడుతున్నారు. వెంకటేశ్వర్లు వరుసకు బావమరిది పూనూరి శోభన్‌బాబు (29) అక్కడికి వెళ్లి అక్కను కొట్టొద్దని బావకు అడ్డుపడ్డాడు. ఆగ్రహించిన వెంకటేశ్వర్లు తన భార్యను కొట్టడం వదిలేసి శోభన్‌బాబు గొంతు పట్టుకొని గట్టిగా నులిమాడు. దీంతో శోభన్‌బాబు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స కోసం రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. వెంకటేశ్వర్లుకు శోభన్‌బాబు మేనల్లుడు కూడా అవుతాడు. రాజేశ్వరి తన భర్తతో గొడవపడి రెండు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. వాస్తవానికి వీరిది చీమకుర్తి మండలం పిడతలపూడి. మంగళవారం రాత్రి భార్య రాజేశ్వరి వద్దకు వచ్చాడు. బుధవారం ఉదయం నిద్ర లేవగానే ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. ఆ ఘర్షణ మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంది. కూలి పనికి వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. వారి గొడవను అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్య నేరం కింద పామూరి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ఏపి ఎన్జీవోస్ జేఏసి కో ఛైర్మన్ వెంకటేశ్వర్లుతో సాక్షి వేదిక