వాషింగ్టన్ డీసీ: అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. యూఎస్‌ఏ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వామి వారి కళ్యాణం తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకుల చేతుల మీదుగా సంప్రదాయ బద్ధంగా జరిగింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించగా..ప్రముఖ గాయని శోభారాజు తన గానంతో భక్తుల్ని అలరించారు.
ఈ కార్యకార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్, కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు, కిరణ్ పోశామ్, ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల,హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్, వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి వల్లూరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment