రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య సంచలన విషయాలు ప్రకటించారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఆరు నెలల పదవీకాలం ఉండగానే 2019లో తన పదవికి రాజీనామా చేసిన ఆచార్య తన పుస్తకంలో కొన్ని విషయాలను తొలిసారి బహిర్గతం చేశారు. ముఖ్యంగా 2018లో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసిన సంఘటనల వివరాలను పంచుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాలను మూసి తలుపుల వెనుక చర్చించడం కంటే బహిరంగంగా చర్చించడం మేలని వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికలకు ముందు 2.-3 లక్షలు అడిగిని ఎన్‌డీఏ సర్కార్
ప్రధానంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఖర్చు కోసం 2018లో బ్యాలెన్స్ షీట్ నుండి 2-3 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను (ఆర్‌బిఐ) తిరస్కరించిందని విరాల్ ఆచార్య వెల్లడించారు. మింట్ నివేదిక ప్రకారం 2020లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే పుస్తకానికి అప్‌డేట్ ప్రిల్యూడ్ బుక్‌లో దీనికి సంబంధి చాలా విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
రికార్డు లాభాలు బదిలీ
గత ప్రభుత్వాల హయాంలో ఆర్‌బిఐ కి చెందిన నగుదును ప్రభుత్వ ఖాతాకు బదిలీకి సంబంధిచి బ్యూరోక్రసీ అండ్ ప్రభుత్వంలోని క్రియేటివ్ మైండ్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రతీ ఏడాది ఆర్‌బీఐ తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పంచిపెట్టే బదులు, నోట్ల రద్దుకు దారితీసిన మూడేళ్లలో, ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసిందని చార్య చెప్పారు. అలాగే ఆర్‌బిఐపై ఒత్తిడి తీసుకురావడానికి మరో కారణం డివెస్ట్‌మెంట్ రాబడులను పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం అని పేర్కొన్నారు. అలాగే 2023లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ మెరుగుపడటాన్ని ప్రస్తావించిన ఆయన బ్యాడ్ లోన్స్ గుర్తింపు, దిద్దుబాటు చర్యల అమలు లక్ష్యంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన ఆస్తుల నాణ్యత సమీక్ష నిరంతరం అమలుతోనే సాధ్యమైందన్నారు.
ఆర్‌బీఐ సెక్షన్ -7 వివాదం
నిధుల బదిలీలో ఆర్‌బీఐ 80 ఏళ్ల చరిత్రలో సెక్షన్ 7ను సెక్షన్‌ను అమలు చేయడం అనూహ్యమైన చర్య అని ఆర్థిక నిపుణులు భావించారు. ఈ విభేదాలు, ఒత్తిడి నేపథ్యంలోనే ఆప్పటి ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడానికి తొమ్మిది నెలల ముందు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను ఉదహరించినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒత్తిడి క్రమంలోనే పటేల్ రాజీనామా అని అంతా భావించారు.
కాగా 2022లో రూ.30,307 కోట్లతో పోలిస్తే FY23లో, సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. .2019లో ఆర్‌బీఐ అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుకు అనుగుణంగా, ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్, ఎంత మూలధన నిల్వ ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment