రెడ్డి వర్గంలో ఒకరికీ దక్కని పోస్టింగ్
టీడీపీ కూటమి తీరుపై సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్షసాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను గురువారం బదిలీ చేసింది. వారిలో బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలు 15 మంది ఉన్నారు.
ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. జి.నాగేశ్వర్‌రెడ్డి (కాశీబుగ్గ), కె.శ్రీనివాసరెడ్డి (తూర్పు గోదావరి క్రైం), వి.నారాయణస్వామిరెడ్డి ( భీమవరం), పి.మురళీకృష్ణారెడ్డి( విజయవాడ వెస్ట్ ఏసీపీ), పి.వీరాంజనేయరెడ్డి (నెల్లూరు రూరల్), ఎం.సూర్యనారాయణరెడ్డి (గూడూరు), వి.శ్రీనివాసరెడ్డి (నాయుడుపేట), బి.ఉమామహేశ్వరరెడ్డి (శ్రీకాళహస్తి), వై.శ్రీనివాసరెడ్డి (డోన్), జి.ప్రభాకర్‌రెడ్డి (మదనపల్లి), జి.శివభాస్కర్‌రెడ్డి (గుంతకల్లు), ఎన్.రవీంద్రనాథ్‌రెడ్డి (నంద్యాల), పి.రవీంద్రనాథ్‌రెడ్డి (ఇంటెలిజెన్స్), వి.వేణుగోపాల్‌రెడ్డి, (ఇంటెలిజెన్స్), జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (ఇంటెలిజెన్స్)లను బదిలీ చేస్తూ వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుందన్నది స్పష్టమవుతోంది. ఇంకా అనంతపురం రూరల్ డీఎస్పీ శివారెడ్డి, నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటా రెడ్డి ఉన్నారు. వారిని కూడా బదిలీ చేస్తున్నట్టు ఇప్పటికే మౌఖికంగా చెప్పేశారని సమాచారం. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 300 మందికి పైగా డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మొదటి విడతలో 96 మందిని బదిలీ చేసింది. మరో రెండు విడతల్లో మిగిలిన వారిని బదిలీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment