సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మొదలు.. హోంగార్డ్ వరకు సిబ్బందిని బదిలీ చేశారు. వివాదాల పోలీస్‌స్టేషన్‌గా పేరు పడ్డ పంజాగుట్టను రిపేర్ చేయలేమని భావించిన పోలీస్ శాఖ మొత్తానికి మొత్తం సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట స్టేషన్‌లో హోంగార్డు నుంచి ఇన్‌స్పెక్టర్ దాకా ఎన్నో వివాదాలు ఉన్నాయి. పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ప్రజా భవన్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు వేసింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment