
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు డీఈవోలను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం డీఈవోగా ఎస్.యాదయ్య, భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డి, ఎస్‌సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ గా చైతన్య జైనీ దీంతోపాటు యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.సూర్యప్రసాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి డీఈవోగా సూర్యప్రసాద్(అదనపు బాధ్యతలు), సంగారెడ్డి డీఈవోగా నాంపల్లి రాజేశ్, కరీంనగర్ డీఈవోగా సీహెచ్.వి.ఎస్.జనార్దన్‌రావు, రంగారెడ్డి డీఈవోగా పి.సుశీంద్రరావు, నారాయణపేట డీఈవోగా లియాఖత్ అలీ, వనపర్తి డీఈవోగా ఎ.రవీందర్, జోగులాంబ గద్వాల డీఈవోగా మహ్మద్ సిరాజుద్దీన్, జనగాం డీఈవోగా టి.రాము(అదనపు బాధ్యలు) నియమించారు. మేడ్చల్ జిల్లా డీఈవోగా ఉన్న విజయకుమారిని స్కూల్ ఎడ్యూకేషన్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
చదవండి: TS: సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు.. ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్