ముంబై: ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడుపదార్థాలున్న కారు నిలిపిన కేసుకు సంబంధించి సర్వత్రా విమర్శల పాలైన మహారాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ముంబై నగర పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌ను హోంగార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. అదనపు డీజీపీ అయిన హేమంత్ నగ్రాలెను ముంబై నగర పోలీసు కమిషనర్‌గా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న∙కారు పార్కు చేసి ఉండడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పోలీసు అధికారి సచిన్ వాజేని అరెస్ట్ చేసింది. అయితే దీని వెనుక ఇంకా చాలా మంది ఉన్నారని తమ దర్యాప్తులో తేలిందని త్వరలోనే ఈ కుట్ర కోణాన్ని బయట పెడతామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సీఎం ఠాక్రేను హోంశాఖ మంత్రి అనిల్ కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment