టీహబ్‌లో జరిగిన జీసీసీ ఇన్నోవేషన్ సమ్మిట్–2024లో మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: రాష్ట్ర ఐటీ ఎగుమతులు, ఆర్థికవృద్ధిని నడపడానికి మిడ్ మార్కెట్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) కీలకమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో జీసీసీ ఇన్నోవేషన్ సమ్మిట్–2024ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో హైదరాబాద్‌కు ఉన్న అసాధారణ ప్రతిభతోపాటు, సహాయక విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలతో మేము ఈ కీలక ప్లేయర్స్‌ను ఆకర్శించడానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు.
టీహబ్ తాత్కాలిక సీఈఓ సుజిత్ జాగిర్దార్ మాట్లాడుతూ జీసీసీలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయే‹Ùరంజన్, తెలంగాణ రాష్ట్ర చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శ్రీకాంత్‌లంక, ఏఎన్‌ఎస్‌ఆర్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆహూజా ప్రసంగించారు. టీహబ్ ఐఈఈఈ –టోరంటో, బిజినెస్ డెవలప్‌మెంట్ సెంటర్– కెనడా, మెడ్‌ట్రానిక్‌తో సహా కీలకమైన ఎనిమిది వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను చేసుకున్నట్టు ప్రకటించింది.
టీజీటీఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి
ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను సరఫరా చేసే నోడల్ ఏజెన్సీ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీజీటీఎస్) తన పరిధిని మరింత పెంచుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. టీజీటీఎస్ పనితీరును సైఫాబాద్ హాకా భవన్‌లోని కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ విభాగాలన్నీ సంస్థ ద్వారా కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సేకరించుకునేలా సమన్వయం చేసుకోవాలన్నారు. దీనిపై జయేశ్ రంజన్‌తో చర్చించాలన్నారు. ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రికి వివరించారు. వీటిలో కొన్ని సొంతంగా కొనుగోళ్లు జరుపుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కొద్ది మొత్తంలో కొనుగోళ్ల కంటే భారీ ఆర్డర్ల ద్వారా రాయితీలు, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ పరికరాలు సేకరించవచ్చని ఆయా శాఖాధిపతులకు వివరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment