- జీసీసీ ఎండీ రవిప్రకాష్
ఈ–వేలంలో కాఫీ అమ్మకాలు పూర్తి
Published Sun, Aug 21 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
పాడేరు : ఏజెన్సీలోని వివిధ మండలాల నుంచి 2015–16 సంవత్సరంలో గిరిజనుల నుంచి జీసీసీ సేకరించిన కాఫీ గింజల అమ్మకాలను పూర్తి చేసినట్లు జీసీసీ ఎండీ ఏఎస్‌పీఏ రవిప్రకాష్ ఆదివారం తెలిపారు. గిరిజన రైతుల నుంచి సేకరించిన పార్చ్‌మెంట్ చెర్రి కాఫీను గ్రేడింగ్ చేసి ఈ–వేలంలో విక్రయించి రెండవ విడత చెల్లింపులు పూర్తి చేసిన ట్లు చెప్పారు. ఆఖరి విడతగా ఈ నెల 19న నిర్వహించిన ఈ–వేలంలో చెర్రి కాఫీ అమ్మకాలు పూర్తి చేసామన్నారు. ఈ మేరకు పాడేరు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లో 602 మంది గిరిజన రైతుల నుండి సేకరించిన 5678కిలోల చెర్రి కాఫీకు కిలోకు రూ.12.93పైసల చొప్పున, జీకే వీధి మండలంలో 693 మంది రైతుల నుండి సేకరించిన 19588 కిలోల కాఫీకి రూ.12.60పైసల చొప్పున చింతపల్లి మండలంలో 1078 రైతుల నుండి సేకరించిన 139044 కిలోల కాఫీకి కిలోకు రూ.15.81 చొప్పున, అరుకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లో 294 మంది రైతుల నుండి సేకరించిన 13321 కిలోల చెర్రి కాఫీకి కిలోకు రూ. 10.30పైసల చొప్పున ఈ నెల 27లోగా ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement