mnc
-
టాప్ అమెరికా ఎంఎన్సీ సీఈవోగా ఇండో అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్
న్యూఢిల్లీ: భారతీయ సంతతికి చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మరో టాప్ ఇంటర్నేషనల్ కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. అమెరికాలోని దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీ హనీవెల్ ఇంటర్నేషనల్ కొత్త సీఈఓగా విమల్ కపూర్ ఎంపికయారు. ప్రస్తుత సీఈవీ డారియస్ ఆడమ్జిక్ స్థానంలో కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు. 57 ఏళ్ల కపూర్ ఏడాది జూన్ 1 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ నెల(మార్చి) 13 నుంచి హనీవెల్ డైరెక్టర్ల బోర్డులో కూడా చేరతారని తెలిపింది తెలిపింది. విమల్ కపూర్ ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్, సీవోవోగా సేవలందిస్తున్నారు. పనిచేస్తున్నారు. అలాగే డారియస్ ఆడమ్జిక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారని హనీవెల్ స్పష్టం చేసింది. 2018లో ఛైర్మన్‌గా, 2017లోసీఈవోగా నియమితులైన ఆడమ్జిక్ నేతృత్వంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 88 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్లకు డాలర్లకు పెరగడం విశేషం. పాటియాలాలోని థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్స్ట్రుమెంటేషన్లో స్పెషలైజేషన్‌తో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. ఇండియాలో స్టడీ పూర్తి చేసిన తర్వాత కంపెనీలో చేరిన విమల్ అనేక కీలక పదవులను నిర్వహించారు. నిర్మాణ సాంకేతికతలతో పాటు పనితీరు మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ల సీఈవోగా సేవలందించారు. వైవిధ్యభరిత తయారీదారుల వివిధ వ్యాపారాలకు నాయకత్వం వహించిన విమల్ కపూర్‌కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. హనీవెల్ సీఈవోగా నియమితులైన దాదాపు 10 నెలల తర్వాత మరో కీలక పదవికి ప్రమోట్ అయ్యారు. అమెరికన్ లిస్డెడ్ కంపెనీహనీవెల్ ఇంటర్నేషనల్.. ఏరోస్పేస్, బిల్డింగ్ టెక్నాలజీస్, పెర్ఫార్మెన్స్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీస్, సేఫ్టీ అండ్ ప్రొడక్టివిటీ సొల్యూషన్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది -
ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయ్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఆర్థిక సంస్కరణల జోరు కొనసాగుతుందని .. పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. కోవిడ్–19 మహమ్మారితో తలెత్తిన సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మల్చుకుందని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చిందని ఆమె తెలిపారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బహుళ జాతి సంస్థల జాతీయ సదస్సు–2020లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయంలోనూ భారీ సంస్కరణల అమలు అవకాశాలను ప్రధాని నరేంద్ర మోదీ చేజారనివ్వలేదు. దశాబ్దాలుగా వెలుగుచూడని అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇదే జోరు ఇకపైనా కొనసాగుతుంది. సంస్కరణలకు సంబంధించి క్రియాశీలకంగా మరెన్నో చర్యలు తీసుకుంటున్నాం‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పన్ను వివాదాలు సత్వరం పరిష్కారమయ్యేందుకు భారీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు. సంస్కరణల అజెండాకు కొనసాగింపుగా ఆరు రాష్ట్రాల్లో ఫార్మా, వైద్య పరికరాలు, ఏపీఐల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా తయారీ జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. నిబంధనలు మరింత సరళతరం.. విదేశీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు అంతా ఒకే చోట అందుబాటులో ఉండేలా ఏకీకృత సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్ నుంచి ఆశిస్తున్న అంశాలన్నీ రాబోయే బడ్జెట్లో పొందుపర్చబోతున్నట్లు మంత్రి వివరించారు. మోదీ ఇటీవల 20 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భేటీ కావడాన్ని ప్రస్తావిస్తూ.. ఆయా సంస్థల ప్రతినిధులు ఒక్కొక్కరితో ప్రధాని విడివిడిగా సమాలోచనలు జరుపుతున్నారని ఆమె తెలిపారు. పలు సార్వభౌమ ఫండ్ సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి వ్యక్తం చేశాయని సీతారామన్ వివరించారు. -
2 లక్షల మార్క్‌ను దాటేసిన కాగ్నిజెంట్
సాక్షి, బెంగళూరు : గ్లోబల్ టెక్నాలజీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారతదేశంలో ఎక్కువ వైట్ కాలర్ ఉద్యోగాలను కల్పిస్తున్న రెండవ సంస్థగా అవతరించింది. టీసీఎస్ తరువాత 2 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న రెండవ ఐటి కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. గ్లోబల్‌గా 2.9 లక్షల ఉద్యోగులను కలిగి వుంది. కాగ్నిజెంట్ ఇండియా సీఎండీగా రాంకుమార్ రామమూర్తిని నియమించిన సందర్భంగా కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. భారతదేశంలోని ఉద్యోగులు, టీంతో లెక్కలేనన్ని పరస్పర చర్చలు, రెండు వారాల పర్యటన అనంతరం రత్నం లాంటి కాగ్నిజెంట్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ప్రశంసలు కురిపించారు. తమ గ్లోబల్ డెలివరీ, సొల్యూషన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఉందన్నారు. భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులైన, నిబద్థత కలిగిన సహోద్యోగులను కలిగి ఉండటం తమ అదృష్టమని వ్యాఖ్యానించారు. రెండు లక్షలపైగా ఉద్యోగులు ఖాతాదారులకు విలువైన సేవలందించారనీ, పరిశ్రమలోనే అత్యంత విలువైన సేవలు, నూతన ఆవిష్కరణల సామర్థ్యంతో కాగ్నిజెంట్ ఇండియా ఉజ్వల భవిష్యత్తు వెలుగొందుతుందన్నారు. కాగా ఇండియాలో అతి ఎక్కువమంది ఉద్యోగాలను కల్పిస్తున్న సంస్థగా టీసీఎస్ వుంది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉద్యోగులుండగా, వీరిలో ఎక్కువమంది భారతీయులే. మరోవైపు ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 40వేల మంది విదేశీయులు. -
ఐటీ కంపెనీలో 10వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా 10వేల మంది ఉద్యోగాల అవకాశాలను కల్పించనున్నామని అమెరికాకు చెందిన బహుళజాతి ఐటి సేవల సంస్థ డీఎక్స్ సీ టెక్నాలజీస్ తాజాగా ప్రకటించింది. ప్రధానంగా డిజిటల్ నైపుణ్యం ఉన్న వారికి ఎంపిక చేస్తామని తెలిపింది. వీరిలో 1500మందిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేసుకుంటామంది. డిజిటల్ సేవలకై పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన 10వేల మంది టెక్కీలను నియమించుకోవాలని యోచిస్తున్నామని డీఎక్స్‌సీ టెక్నాలజీస్ గ్లోబల్ హెడ్ శాంసన్ డేవిడ్ తెలిపారు. కాగా డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో, యుఎన్ఎస్లో ప్రతిభావంతుల కొరతను ఎంఎన్‌సి ఐటి కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఆఫ్‌షోర్ స్థావరాన్ని భారతదేశానికి తరలిస్తున్నాయి. సీఎస్సీ, హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ విలీనం తరువాత 2017 లో స్థాపించబడిన డీఎక్స్‌సీ ఐటి సంస్థలో భారతదేశంలో దాదాపు 45 వేల మంది పనిచేస్తుండగా, గ్లోబల్‌గా 1.30లక్షల మంది ఉన్నారు. -
మార్కెట్లో ‘వాటా’ ముసలం!
స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ తాజా ప్రతిపాదన స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. బడ్జెట్ రోజు, ఆ తర్వాతి రోజు కొనసాగిన నష్టాలకు ప్రధాన కారణాల్లో ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రతిపాదన కూడా ఒకటి. ఈ ప్రతిపాదన కారణంగా టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు, డిమార్ట్ రిటైల్ స్టోర్స్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ వంటి దిగ్గజ కంపెనీలు కనీసం 10–20 శాతం మేర వాటాను విక్రయించాల్సి వస్తుంది. బీఎస్ఈలో దాదాపు 4,000కు పైగా కంపెనీలు లిస్ట్‌కాగా, వీటిల్లో 1,100 మేర కంపెనీలు వాటా విక్రయం జరపాల్సి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. బహుళజాతి కంపెనీలు(ఎమ్ఎన్సీ) బాధ ఇంకొక ఎత్తు. చాలా ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం రేంజ్లో ఉంది. ఇవి 10 శాతం మేర వాటా విక్రయించాల్సి రావచ్చు. అయితే వాటా విక్రయానికి బదులుగా అసలు స్టాక్ మార్కెట్ నుంచే డీలిస్ట్ అయ్యే దిశగా ఈ ఎమ్ఎన్సీలు యోచిస్తున్నాయని సమాచారం. ఈ విషయమై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ.... లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్‌ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఒక లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్ హోల్డింగ్ పెంపు ప్రతిపాదనకు సెబీ త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని, రెండేళ్ల గడువుని ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన స్టాక్ మార్కెట్ నుంచి లిక్విడిటీని లాగేయడమే కాకుండా, ప్రమోటర్ వాటా అధికంగా ఉన్న బహుళ జాతి కంపెనీలు మన స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఇలాంటి కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఈ కంపెనీలు డీలిస్టింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక బిజినెస్ టు బిజినెస్(బీ2బీ)రంగంలో ఉన్న కంపెనీలు పూర్తిగా డీలిస్టింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి కంపెనీల వ్యాపారాలకు బ్రాండ్లతో పని లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజా ప్రతిపాదనలపై ఎమ్ఎన్సీలు ఇప్పటివరకైతే, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పడూ ఇదే పరిస్థితి... మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ 2010–13లో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను తెచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. పలు ఎమ్ఎన్సీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ తాజా ప్రతిపాదన ప్రకారం ప్రజలకు 35 శాతం వాటాను కేటాయించాల్సి వస్తే, ఎమ్ఎన్సీలు రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి రావచ్చు. ఎమ్ఎన్సీలు, ఇతర భారత కంపెనీలు కలసి మొత్తం మీద రూ. 4 లక్షల కోట్ల మేర షేర్లను విక్రయించే అవకాశాలున్నాయి. ఎమ్ఎన్సీలు...మంచి పనితీరు... మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నా, చాలా ఎమ్ఎన్సీలు మంచి పనితీరునే కనబరుస్తూ వచ్చాయి. మొత్తం గత 16 ఏళ్లకు గాను 11 ఏళ్లలో ఎమ్ఎన్సీ షేర్లు నిఫ్టీని మించిన రాబడులనిచ్చాయి. 2006 నుంచి చూస్తే, వరుసగా 13 ఏళ్ల పాటు నిఫ్టీని మించిన పనితీరును ఎమ్ఎన్సీలు చూపించాయి. తాజా ప్రతిపాదన తక్షణం అమలయ్యే అవకాశాల్లేవు. దశలవారీగానే ఈ ప్రతిపాదన అమల్లోకి రావచ్చు. కనీసం 3–4 ఏళ్లు పడుతుందని అంచనా. అయినప్పటికీ, ఇది ఆయా షేర్ల పనితీరుపై తీవ్రంగానే ప్రభావం చూపించవచ్చు. ప్రమోటర్ వాటా 75 శాతానికి పైగా ఉన్న సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ వంటి కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఇది ఆయా షేర్ల పనితీరుపై సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. అయితే సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఈ షేర్లు తగ్గితే అది కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆంటిక్ స్టాక్ బ్రోకింగ్ పేర్కొంది. ఓఎఫ్ఎస్ల వెల్లువ... ఈ ప్రతిపాదన కారణంగా ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్)లు వెల్లువెత్తుతాయని నిపుణులంటున్నారు. వాటా విక్రయానికి చౌకైన, వేగవంతమైన ప్రక్రియ ఇదేనని, దీంతో స్టాక్ మార్కెట్లో ఓఎఫ్ఎస్లు వెల్లువెత్తుతాయని, దీంతో సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందని వారంటున్నారు. ఈ ప్రతిపాదన కారణంగా కొన్ని ఉత్తమ ఫలితాలూ ఉంటాయని విశ్లేషకులంటున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల యాజమాన్యం మరింతగా విస్తరిస్తుందని, స్టాక్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని, షేర్లకు సరైన విలువ లభిస్తుందని, కార్పొరేట్ గవర్నెన్స్ మరింతగా మెరుగుపడగలదని వారంటున్నారు. అంతే కాకుండా నాణ్యత గల షేర్లు సమంజసమైన ధరకు లభించే అవకాశాలూ ఉన్నాయి. -
కోటి జీతం వదిలి..కోచింగ్ లేకుండా..
ఓవైపు మల్టీనేషన్ కంపెనీ (ఎంఎన్సీ)లో ఏడాదికి కోటి రూపాయల జీతం. మరోవంక అనుకున్న లక్ష్యం సాధించాలనే సంకల్పం. భారీ జీతం కంటే లక్ష్యం వైపే మొగ్గు చూపి.. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించాడు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్. ముంబైలో ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సామ్సంగ్ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. పట్టుదలతో చదివి ప్రతిభ కనబరచాడు. చిన్నప్పటి నుంచే చదువులో పృథ్వీ మంచి ప్రతిభ కనబరచేవాడని ఆయన తండ్రి యిమ్మడి శ్రీనివాసరావు, తల్లి రాణి తెలిపారు. 100వ ర్యాంకు సాధించిన నారపురెడ్డి మౌర్య వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలోని నాగులపల్లెకు చెందిన రైతు నారపురెడ్డి ఓబుళరెడ్డి కుమార్తె మౌర్య యూపీఎస్సీ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లో స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించింది. 206వ ర్యాంక్: నాగవెంకట మణికంఠ గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీహెచ్ నాగవెంకట మణికంఠ సివిల్ సర్వీసెస్‌లో 206 ర్యాంక్ సాధించారు. ప్రకాశం జిల్లా మార్టురులో ఇంటర్ వరకు చదివిన మణికంఠ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. 2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం డెహ్రాడూన్‌లో శిక్షణ పొందుతున్నారు. ఆయన తండ్రి సీహెచ్ మంగాచారి ఫొటోగ్రాఫర్, తల్లి శారదాదేవి గహిణి. 512వ ర్యాంక్: ప్రవీణ్‌చంద్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సివిల్స్‌లో 512వ ర్యాంకు సాధించారు. పాట్నా ఐఐటీలో ఎలక్టిక్రల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్ చంద్ ..నలుగురికీ సేవచేయాలనే లక్ష్యంతో తన బెంగళూరులో తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. 2016లో సివిల్స్‌కు ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అవకాశం రాలేదు. 2017 జూన్‌లో ప్రిలిమ్స్లోను, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు రాసి, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో 512వ ర్యాంకు సాధించాడు. కోచింగ్ తీసుకోకుండానే 374వ ర్యాంకు 2017 సివిల్స్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాతల కుమారుడు రిషికేశ్‌రెడ్డి శుక్రవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 374 ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. 245వ ర్యాంకు: చందీష్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం అడపగుండ్లపల్లి గ్రామానికి జి. చందీష్ సివిల్స్‌లో 245వ ర్యాంకు సాధించారు. తనను ఐపీఎస్‌గా చూడాలన్నదే తన అమ్మానాన్న కోరిక అని తెలిపారు. 513వ ర్యాంకు: ప్రసన్నకుమారి అనంతపురం జిల్లాకు చెందిన ప్రసన్న కుమారికి సివిల్స్ ఫలితాల్లో 513వ ర్యాంకు పొందారు. తాడిపత్రి రూరల్ మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకుమారి బీటెక్‌ను 2014లో పూర్తి చేసి 2015 నుంచి సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇటీవల విడుదలైన గ్రూప్–1లోనూ డీఎస్పీ పోస్టు దక్కింది. సేవాభావమే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లేలా చేసిందని ప్రసన్న కుమారి తెలిపారు. 884 ర్యాంకు: వంశీ దిలీప్ 2017 సివిల్స్ ఫలితాల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఇరుకుపాలెంకు చెందిన మీరావత్ వంశీదిలీప్ 884వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి డాక్టర్ మీరావత్ గోపినాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఐదేళ్లపాటు గుంటూరు జిల్లాలో పనిచేశారు. వరంగల్ నిట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో క్యాంపస్ సెలక్షన్లో తమిళనాడు నైవేలీలో నెలకు రూ.67వేల వేతనానికి ప్రై వేటు కంపెనీలో ఎంపికయ్యాడు. తొమ్మిదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సివిల్స్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలిపెట్టి ఢిల్లీలో కోచింగ్‌లో చేరాడు. ఒకసారి సివిల్స్ మెయిన్స్ వరకు, మరోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. మూడోసారి పట్టుదలతో చదివి 884వ ర్యాంకు సాధించాడు. తన తండ్రి జిల్లా వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన్ను చూసి ప్రజలకు సేవలు అందించేందుకు సివిల్స్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు వంశీ దిలీప్ తెలిపాడు. 6వ ర్యాంకు శ్రీహర్ష ఖమ్మంఅర్బన్: ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన కోయ శ్రీహర్ష శుక్రవారం వెలువరించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈయన తల్లిదండ్రులు కోయ నాగేశ్వరరావు, సులోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు. శ్రీహర్ష 1 నుంచి 5వ తరగతి వరకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు బల్లేపల్లి ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ను హైద రాబాద్లోని నారాయణ కళాశాలలో, ఇంజనీరింగ్‌ను ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో పూర్తి చేశారు. 2012లో సిగ్నోర్ ఇండియా కంపెనీలో ఉద్యోగాన్ని పొంది.. హైదరాబాద్, గుజరాత్లో పనిచేసిన ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2017 సివిల్స్ పరీక్షలో ప్రతిభను చాటి, శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 6వ ర్యాంక్‌తో సత్తా చాటారు. 22 ఏళ్లకే సివిల్స్.. హైదరాబాద్ కుర్రాడి ఘనత హెదరాబాద్ కుర్రాడు సాయి తేజ మొదటి ప్రయత్నంలోనే 22ఏళ్లకే సివిల్స్‌లో 43వ ర్యాంకు సాధించారు. ఆయన మాటల్లోనే...‘ హైదరాబాద్(మలక్ పేట). నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఐఐటీ, హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. 2016లో బీటెక్ పూర్తవుతూనే సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను. 2017 జూన్‌లో ప్రిలిమ్స్ రాశాను. పబ్లిక్ సర్వీసులోకి రావాలని, సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి ఎంతో చేయొచ్చని భావించి సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను. నాన్న సివిల్స్ ద్వారా సమాజానికి సేవ చేయొచ్చని చెబుతుండటం కూడా నేను సివిల్స్ వైపు రావడానికి కారణం. సివిల్స్‌కు చాలా తక్కువ పుస్తకాలు చదివా. క్రమశిక్షణతో అంకితభావంతో ప్రిపరేషన్ కొనసాగించా. ఆయా అంశాలను విశ్లేషణాత్మకంగా చదవడం లాభించింది. పొలిటికల్‌సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆఫ్షనల్‌గా ఎంచుకున్నా. ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన, అంతర్జాతీయ అంశాలను అడిగారు. నమ్మకం, పట్టుదలతోనే విజయం సాధించా’. జేసీ కుమారుడికి 393 ర్యాంక్ సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య కుమారుడు సురభి ఆదర్శ్ సివిల్స్‌లో 393 ర్యాంకు సాధించారు. గతంతో మెయిన్స్ వరకు వెళ్లిన ఆదర్స్ ఈసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధించారు. సివిల్స్ సాధించాలన్నది తన కల అని.. ఇందుకోసం కష్టపడి చదివినట్లు చెప్పారు. అమ్మానాన్న పోత్సాహంతోనే: సాయినాథ్‌రెడ్డి యూపీఎస్సీ శుక్రవారం వెల్లడించిన సివిల్స్ తుది ఫలితాలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ ఆలిండియా 480వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి భాగ్యలక్ష్మి, లింగారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు సాయినాథ్‌రెడ్డి. ఒకటి, రెండు తరగతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఢిల్లీలో సివిల్స్‌కు కోచింగ్ తీసుకొని ర్యాంక్ సాధించాడు. 607వ ర్యాంకు: కృష్ణకాంత్ పటేల్ సివిల్స్‌లో 607వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎస్ కావాలనేది నా చిన్ననాటి కల. 2011లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అప్పటినుంచి సివిల్స్‌కు సిద్ధమవుతూ ఉన్నాను. ఇప్పటివరకు 5 సార్లు సివిల్స్ రాశాను. 2016లో ఎస్ఎస్బీలో అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ ర్యాంకు)ఉద్యోగానికి ఎంపికయ్యాను. సివిల్స్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎస్ఎస్బీ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ఎన్నిసార్లు ఓటమి వచ్చినా పట్టుదల వదలకుండా కష్టపడ్డాను. నా విజయానికి తల్లిదండ్రులు, మా అన్నయ్య తోడ్పాటు అందించారు. పాజిటివ్‌గా ఆలోచించడమే నా సక్సెస్ మంత్ర. 624వ ర్యాంకు: ఎడవెల్లి అక్షయ్‌కుమార్ మాది వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ. మా తాత, తండ్రి ఇద్దరు పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితోనే పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. అందుకే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు కొనసాగిస్తున్నాడు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ భూపాల్‌లోని నిట్‌లో పూర్తి చేశాను. క్యాంపస్ ఇంటర్య్వూలో దుబాయ్‌లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది.. కానీ ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో వదులుకున్నా. జాతీయ స్థాయిలో 726వ ర్యాంక్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషు (23) చిన్నవయస్సులోనే సివిల్ సర్వీస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2012–16 విద్యాసంవత్సరంలో ఢిల్లీలో బీటెక్(మెకానికల్) కోర్సు పూర్తి చేసి సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. -
మన ఇంధన సంస్థలు...ఎంఎన్సీలుగా ఎదగాలి
• దేశీయంగా చమురు ఉత్పత్తి పెరగాలి • దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి • పెట్రోటెక్ సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: దేశీ ఇంధన సంస్థలు బహుళ జాతి కంపెనీలుగా (ఎంఎన్సీ) ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆసియాలోని పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాలకు ఎనర్జీ కారిడార్లను ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలన్నారు. ‘‘దేశ ఇంధన అవసరాలు పెరుగుతున్నారుు. వాటిని తీర్చేలా భారత కంపెనీలు విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని సూచించారాయన. సోమవారమిక్కడ పెట్రోటెక్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధికి కీలకమైన ఇంధన ధరలు స్థిరంగా, సముచిత స్థారుులో ఉండాలని మోదీ అభిప్రాయపడ్డారు. పెరిగే డిమాండ్‌కి తగ్గట్లుగా దేశీయంగానే చమురు, గ్యాస్ ఉత్పత్తి మరింత పెంచుకోవాలని, దిగుమతులపై ఆధారపడటం తగ్గాలని ఆయన చెప్పారు. చమురు వినియోగం పెరుగుతున్నప్పటికీ .. 2022 నాటికి దిగుమతులపై ఆధారపడటాన్ని దాదాపు 10 శాతం తగ్గించుకోవాలని నిర్దేశించుకున్నట్లు మోదీ చెప్పారు. ’ఆర్థిక వృద్ధికి ఇంధనమే కీలక చోదకం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరాలంటే ఇంధన ధరలు నిలకడగా, స్థిరంగా, సముచితమైన స్థారుులో ఉండాలి’ అని తెలిపారు. వృద్ధికి హైడ్రోకార్బన్స కీలకం.. దేశ భవిష్యత్‌కు హైడ్రోకార్బన్స కీలకమన్న మోదీ 2040 నాటికి మొత్తం యూరప్ కన్నా అధికంగా భారత్‌లో వినియోగం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్.. 2040 నాటికి ఐదు రెట్లు ఎదుగుతుందన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 16 శాతంగా ఉన్న తయారీ రంగం వాటా 2022 నాటికి 25 శాతానికి పెరగనుందన్నారు. గణనీయమైన డిమాండ్ నేపథ్యంలో హైడ్రోకార్బన్స రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా.. షేల్ ఆరుుల్, గ్యాస్, కోల్ బెడ్ మీథేన్ మొదలైన ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి ఏకీకృత లెసైన్సు ఇచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బిడ్డర్లు తాము కోరుకున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేట్లు ఓపెన్ ఎక్రేజ్ నిబంధనలు, లాభాల్లో కాకుండా ఆదాయాల్లో వాటాలు, ఉత్పత్తి చేసిన ఇంధనం మార్కెటింగ్.. ధరల విషయంలో స్వేచ్ఛ కల్పించడం తదితర అంశాలు ఇందులో ఉన్నట్లు వివరించారు. పెట్టుబడులకు అపార అవకాశాలు.. భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఈ సందర్భంగా మోదీ తెలియజేశారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసిన నేపథ్యంలో విదేశీ హైడ్రోకార్బన్ కంపెనీలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆహ్వానించారు. మందగమన పరిస్థితుల్లోనూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థిరంగాను, వేగవంతంగాను వృద్ధి నమోదు చేస్తోందని చెప్పారు. కరెంటు అకౌంటు లోటు దశాబ్దాల కనిష్టానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధిక స్థారుుకి పెరిగాయన్నారు. 2040 నాటికి వాణిజ్య వాహనాల సంఖ్య 1.3 కోట్ల నుంచి 5.6 కోట్లకు చేరనున్నాయని, దీనికి తగినట్లుగా రవాణా మౌలిక సదుపాయాలను అనేక రెట్లు మెరుగుపరుస్తున్నామని మోదీ చెప్పారు. ఇక పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ 2034 నాటికి మూడో స్థానానికి చేరనుందన్నారు. దీంతో విమాన ఇంధనానికి డిమాండ్ నాలుగు రెట్లు పెరగనుందని తెలిపారు. చమురుకు రెట్టింపు డిమాండ్.. 2040 నాటికి భారత్‌లో చమురు డిమాండ్ రెట్టింపు కాగలదని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సనుసీ బర్కిందో చెప్పారు. అప్పటికల్లా రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ)కు పెరగొచ్చన్నారు. 2015లో ఇది రోజుకు సుమారు 4.1 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. క్రూడ్ వినియోగం పెరుగుదలకు రవాణా, పెట్రోకెమికల్ వంటి రంగాలు కారణం కాగలవని బర్కిందో తెలిపారు. ఆరుుల్ మార్కెట్ స్థిరీకరణలో భారత్ కీలకపాత్ర పోషించగలదన్నారు. భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్‌లో 85%, గ్యాస్‌లో 90% ఒపెక్ సభ్య దేశాల నుంచే వస్తోంది. అధిక రేట్లతో వృద్ధికి విఘాతం.. చమురు రేట్లు అధిక స్థారుులో ఉంటే భారత వృద్ధి గమనంపై ప్రతికూల ప్రభావం పడగలదని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఉత్పత్తిని తగ్గించాలంటూ చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్ నిర్ణరుుంచిన దరిమిలా క్రూడ్ బ్యారెల్ రేటు 50 డాలర్ల మార్కు దాటేసిందని, ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ధరను నిర్ణరుుంచేటప్పుడు డిమాండ్, సరఫరా భద్రతలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
నేడు ఎస్ఎంసీ ఎన్నికలు
కర్నూలు (కొండారెడ్డిపోర్ట్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంటు కమిటీ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2931 పాఠశాలలకు నూతన కమిటీల ఎంపికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లోని ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈనెల 29న ఆయా జాబితాలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తుది జాబితాను తయారు చేశారు. సోమవారం ఉదయం 7 నుంచి 1 గంట వరకు స్కూల్ మేనేజ్మెంటు కమిటీ సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఎన్నికైన సభ్యులతో చైర్మెన్, వైస్ చైర్మెన్ల ఎన్నికలు జరుగుతాయి. 2 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు కొత్త కమిటీ ప్రమాణం ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి తెలిపారు. -
పోటీపడి జీతాలు పెంచుతున్న అమెరికా కంపెనీలు
వాషింఘ్టన్: అమెరికాలోని అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా బహుళజాతి సంస్థలు ఇటీవలి కాలంలో తమ ఉద్యోగుల జీత భత్యాలను భారీగా పెంచుతున్నాయి. మునుపెన్నడూ లేని ప్రేమను కురిపిస్తున్నాయి. వారిని ప్రశంసా పత్రాలతో ముంచెత్తుతున్నాయి. అమెరికాలోనే ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన ‘వాల్‌మార్ట్’ కార్పొరేట్ సంస్థ గత ఫిబ్రవరి నెలలోనే తమ ఉద్యోగుల జీత భత్యాలను భారీగా పెంచింది. తమ ఉద్యోగులను ‘అసోసియేట్స్’గా సంబోధిస్తూ ప్రశంసపూర్వక వ్యాఖ్యలు కూడా చేసింది. ‘మీరు పడ్డ కష్టానికి ఇది ప్రతిఫలం. పని నేర్చుకోవడానికి, ఎదగడానికి, వాల్‌మార్ట్ కన్నా మీ కరీర్‌ను గొప్పగా అభివృద్ధి చేసుకోవడాని ఇంతకన్నా మంచి ప్లేస్ మరొకటి ఉండదు’ అంటూ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డౌగ్ మ్యాక్ మిలన్ లేఖ రాశారు. ఎల్లప్పుడు ఈ సంస్థ తమ ఉద్యోగులను ‘అసోసియేట్స్’ అనే సంబోధిస్తుంది. ఇక స్టార్‌బక్స్ కంపెనీ కూడా దాదాపు లక్ష మంది కార్మికులకు ఇటీవల జీతభత్యాలను పెంచింది. ఈ కంపెనీ తమ ఉద్యోగులను ‘పార్ట్నర్స్’ అని సంబోధిస్తుంది. ‘తోటి మానవులతో సంబంధాలు పెట్టుకున్నప్పుడే విశ్వాసం వికసిస్తుంది’ కంపెనీ చైర్మన్, సీఈవో హొవార్డ్ శుల్జ్ తమ పార్ట్నర్స్కు లేఖ రాశారు. ఇటీవల అమెరికాలో జరిగిన కాల్పుల సంఘటనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జేపీ మోర్గాన్ బ్యాంక్ కూడా తక్కువ వేతనాలు అందుకుంటున్న దిగువస్థాయి ఉద్యోగులకు (బ్యాంక్ టెల్లర్ స్థాయి ఉద్యోగులు) ఇటీవల 18 శాతం వేతనాలను పెంచింది. ‘స్తంభించిన వేతనాలు, వేతనాల్లో కొనసాగుతున్న వ్యత్యాసాలు, సరైన విద్యార్హతలు లేకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం, నైపుణ్యాభివృద్ధి లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో మీ పక్షాన నిలబడడం మా పౌర విధి’ అని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జమీ డైమన్ లేఖ రాశారు. జేపీ మోర్గాన్ బ్యాంక్ మాత్రం తమ సిబ్బందిని ‘ఎంప్లాయీస్’ అనే సంబోధిస్తోంది. మెక్ డొనాల్డ్, టార్గెట్, టీజే మాక్స్ సంస్థలు కూడా తమ ఉద్యోగుల జీత భత్యాలను పెంచింది. ఎందుకిలా ఈ కంపెనీలు పోటీపడి జీత భత్యాలను పెంచుతున్నాయి? దీనికి దోహదపడుతున్న పరిణామాలు ఏమిటీ? కార్మికుల కొరత మొదటి కారణం. ఉద్యోగాల కొరత ఉన్నప్పుడు కార్మికులపైన యాజమాన్యం పైచేయి కొనసాగుతుంది. ప్రస్తుతం కార్మికుల కొరత ఉండడంతో కార్మికులకు డిమాండ్ పెరిగింది. కంపెనీ వీడి కార్మికులు బయటకు పోకుండా రక్షించుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే బెనిఫిట్లు చూపిస్తున్నారు. అమెరికాలో 2015, డిసెంబర్లో స్వచ్ఛందంగా ఉద్యోగం మానేసిన వారి సంఖ్య గత పదేళ్లకాలంలోనే ఎక్కువట. అమెరికాలో బహుళజాతి కంపెనీల పట్ల వ్యతిరేక భావం ప్రజల్లో పెరుగుతుండడం రెండో కారణం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పలుదేశాల్లో పవనాలు వీస్తున్న విషయం తెల్సిందే. మూడో కారణం దేశ రాజకీయాలు. వలసలను నియంత్రిస్తామని, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే నినాదాలు దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారి నోట వినిపిస్తున్న విషయం తెల్సిందే. తమ బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా దేశ ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేయకుండా ఉండడం కోసం ఉద్యోగులను మంచి చేసుకోవాలని, తద్వారా ప్రజల్లో సద్భావం కలిగేలా చూడాలన్నది కంపెనీల తాపత్రయం. -
మన ఫార్మాకు అమెరికా గండం!
♦ గతేడాది రికార్డు స్థాయిలో హెచ్చరికలు ♦ 25 కంపెనీల్లో జరుగుతున్న ఎఫ్‌డీఏ దర్యాప్తు ♦ ఫార్మా కంపెనీల లాభాలు; ఎగుమతులపై ఒత్తిడి ♦ ఎంఎన్సీల హస్తం ఉందంటూ సందేహాలు! ♦ అమెరికా జెనరిక్ మార్కెట్లో భారత్ హవానే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ;మన ఫార్మా సంస్థలు తయారు చేసేవన్నీ జెనరిక్ మందులే. వాటికి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అమెరికా. అక్కడి నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతిస్తేనే... ఏ కంపెనీ అయినా తన మందుల్ని విక్రయించగలుగుతుంది. అలాంటి యూఎస్ఎఫ్డీఏ... మునుపెన్నడూ లేని తీరులో దేశీ ఫార్మా కంపెనీలపై కొరడా ఝుళిపిస్తోంది. 2015లో రికార్డు స్థాయిలో మన క ంపెనీలకు 17కు పైగా వార్నింగ్ లేఖలొచ్చాయి. 25కి పైగా కంపెనీలకు చెందిన యూనిట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు కూడా చేస్తోంది. ఈ వార్నింగ్ లెటర్లు అందుకున్న వాటిలో దిగ్గజాలు సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నుంచి చిన్న స్థాయి పాన్ డ్రగ్స్, మైక్రో ల్యాబ్ వరకు అనేక కంపెనీలున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు దేశీ కంపెనీలకు 50కిపైగా హెచ్చరిక లేఖలు వచ్చాయి. కానీ 2015లో ఈ సంఖ్య బాగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే ఇప్కా ల్యాబ్‌కు చెందిన మూడు యూనిట్లకు వార్నింగ్ లెటర్లు అందాయి. ఈ వ్యవహారం దేశీ ఫార్మా రంగ అమ్మకాలపై... ప్రత్యేకించి ఫార్మా రాజధానిగా ముద్రపడ్డ హైదరాబాద్‌పై కూడా పడే అవకాశముందన్నది నిపుణుల మాట. దేశీయ కంపెనీలకు యూఎస్ఎఫ్డీఏ నుంచి వార్నింగ్ లేఖలు, ఇంపోర్ట్ అలర్ట్స్ రావడం వెనుక బహుళజాతి కంపెనీల లాబీయింగ్ పనిచేస్తోందా? అన్న సందేహాలకు పలు వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. అమెరికా జెనరిక్ మార్కెట్లో దేశీ కంపెనీలు దూసుకుపోతుండటమే దీనికి కారణమని ఫార్మా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం ఏడేళ్లలో అంతర్జాతీయ జెనరిక్ ఎగుమతుల్ని రెట్టింపు చేయటమే కాకుండా... అమెరికాలో మార్కెట్లో 5 శాతానికి పైగా వాటాను చేజిక్కించుకుని దేశీ కంపెనీలు ఎంఎన్సీలకు సవాల్ విసురుతున్నాయి. 2008లో 7.8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు 16.5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2020 నాటికి ఈ విలువ 28 బిలియన్ డాలర్లకు చేరుతుందనేది అంచనా. ఈ దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి యూఎస్‌ఎఫ్‌డీఏను అడ్డం పెట్టుకొని ఎంఎన్ఎసీలు తెరవెనుక లాబీయింగ్ చేస్తున్నాయని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని ఓ ఫార్మా సంస్థ ప్రతినిధి చెప్పారు. మన అలవాట్లూ ఓ కారణమే! దేశీ కంపెనీలు అందుకుంటున్న హెచ్చరికల లేఖల్లో స్వయంకృతం కూడా కనిపిస్తోంది. ‘‘అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసే యూనిట్లలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. వారిలో అవగాహనా లోపం వల్లే ఈ లేఖలొస్తున్నాయి’’ అని ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ చెప్పారు. ‘‘మన కంపెనీలు తయారు చేసే ఔషధాల నాణ్యతపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కొన్ని యూని ట్లలో గుడ్ ప్రాక్టీసింగ్ విధానాలు అమలు చేయకపోవడం... డాక్యుమెంటేషన్, డేటా ఇంటిగ్రిటీలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపైనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ యూనిట్లలో అనుసరించాల్సిన విధానాలపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించడానికి యూఎస్ఎఫ్డీఏ సభ్యులతో కేంద్ర వాణిజ్య శాఖ వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తోంది. మరోవంక దేశీ వాతావరణ పరిస్థితులపై ఎఫ్‌డీఏ సిబ్బందికి అవగాహన కల్పించడానికి డీసీజీఐ, ఫార్మాక్సిల్, వాణిజ్య మంత్రిత్వ శాఖ సిబ్బంది మార్చిలో అమెరికాకు వెళ్తున్నారు’’ అని వివరించారాయన. అనుమతులపై ఒత్తిడి... దేశీ కంపెనీలు వార్నింగ్ లెటర్లు అందుకుంటుండంతో కొత్త ఔషధాలకు అనుమతులు రావటం ఆలస్యం కావచ్చని, కంపెనీల లాభాలు తగ్గవచ్చని ‘ఇక్రా’ నివేదిక పేర్కొంది. గత పదేళ్ల చరిత్రను చూస్తే వార్నింగ్ లేఖల్లో 40 శాతం కేసులే ఇంపోర్ట్ అలర్ట్‌ల వరకు వెళుతున్నాయని ఇక్రా తెలిపింది. పెద్ద ఫార్మా కంపెనీలు సగటున ఏడాదిలోగా వార్నింగ్ లేఖల సమస్యను పరిష్కరించుకుంటున్నట్లు తెలియజేసింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 25 కంపెనీలకు సంబంధించి 50కిపైగా యూనిట్లలో తనిఖీలు జరుగుతున్నాయి. వీటివల్ల కొత్త జెనరిక్ల విడుదల ఆలస్యమయ్యే అవకాశముంది. ఇదే ధోరణి కొనసాగితే ఎగుమతులు కూడా తగ్గే అవకాశం ఉందని పీడబ్ల్యూసీ పేర్కొంది. ఫార్మాక్సిల్ మాత్రం ఇంతవరకు వార్నింగ్ లేఖల ప్రభావం ఎగుమతులపై పడలేదని తెలియజేసింది. డిసెంబర్ నాటికి గతేడాదితో పోలిస్తే ఎగుమతులు డాలర్లలో 9.7 శాతం వృద్ధితో 12 బిలియన్ డాలర్లు దాటాయి. అదే రూపాయల్లో 17 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇంపోర్ట్ అలర్ట్స్ లేకపోతే ఈ ఏడాది ఎగుమతుల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను అప్పాజీ వ్యక్తం చేశారు. -
నవీముంబై మేయర్‌గా సుధాకర్ సోనావణే
ముంబై సెంట్రల్: నవీముంబై మేయర్‌గా ఎన్సీపీ అభ్యర్థి సుధాకర్ సోనావణే గెలుపొందారు. నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ)కు శనివారం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. శివసేన అభ్యర్థి సంజూ వాడ్పై 23 ఓట్ల తేడాతో సుధాకర్ గెలుపొందారు. సంజూకు 44 ఓట్లు, సుధాకర్‌కు 67 ఓట్లు వచ్చాయి. కాగా, డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి అవినాశ్ లాడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధిపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు గణేశ్ నాయిక్ సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకొని పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ అవినాశ్ మాట్లాడుతూ.. పట్టణంలో ఆరోగ్య సేవలను నవీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ మేయర్ అవినాశ్ లాడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణాన్ని మరింత సౌందర్యవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. -
'ఎంఎన్సీలకు ఏపీని తాకట్టు పెట్టేస్తారా'
ఆంధ్రప్రదేశ్‌లో బహుళ జాతీయ సంస్థల (ఎంఎన్సీల) రిటైల్ ఔట్లెట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వడం దారుణమని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈ అనుమతుల వెనక ఉన్న గుట్టేంటని ప్రశ్నించారు. ఎంఎన్సీలకు ఏపీని తాకట్టుపెట్టడమే మీ లక్ష్యమా అని పద్మ నిలదీశారు. అనుమతి ఇచ్చినందుకు టీడీపీ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ముడుపులు అందాయని పద్మ ప్రశ్నించారు. గతంలో ఎఫ్‌డీఐలను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడెందుకు మారారని పద్మ విమర్శించారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో మరోలా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. కోట్లాదిమంది చిల్లరవర్తకులు మీకు గుర్తుకు రాలేదా అంటూ పద్మ.. చంద్రబాబును విమర్శించారు. -
నైపుణ్య శిక్షణకు ఎంఎన్‌సీలతో భాగస్వామ్యం
ఎన్ఎస్డీసీ ఎండీ దిలీప్ షెనాయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ఎంఎన్సీ(బహుళజాతి కంపెనీలు)లతో చేతులు కలుపుతున్నట్టు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) తెలిపింది. ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఎయిర్టెల్, సేఫ్ ఎక్స్‌ప్రెస్ వంటి 20కిపైగా దిగ్గజాలతో ఇప్పటికే భాగస్వామ్యం కుదిరిందని ఎన్ఎస్డీసీ ఎండీ, సీఈవో దిలీప్ షెనాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. వచ్చే ఏడాదికల్లా మరో 25 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటామని వెల్లడించారు. అభ్యర్థులకు నేరుగా కంపెనీల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా 160కి పైగా కంపెనీలు, శిక్షణ సంస్థలు, విద్యాలయాలతో కలిసి ఎన్ఎస్డీసీ పనిచేస్తోందన్నారు. కొత్త రంగాల్లో.. సోలార్ ఎనర్జీ, నీటి, వ్యర్థాల నిర్వహణ వంటి కొత్త రంగాల్లో నిపుణుల అవసరం రానున్న రోజుల్లో గణనీయంగా ఉండనుంది. ఇందుకు అనుగుణంగా పరిశ్రమకు కావాల్సిన నిపుణుల తయారీలో ఎన్ఎస్డీసీ నిమగ్నమైందని దిలీప్ షెనాయ్ వెల్లడించారు. విదేశాల్లోనూ పనిచేయగలిగేలా శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం యూకే కమిషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్ వంటి సంస్థల సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘2022 నాటికి దేశీయంగా కొత్తగా 35 కోట్ల మంది నిపుణులు అవసరమని ఎన్ఎస్డీసీ అధ్యయనంలో తేలింది. 2014లో దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య రెండింతలు కానుంది’ అని తెలిపారు. చేతులు కలిపిన స్కిల్‌ప్రో.. నైపుణ్య శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్ కంపెనీ స్కిల్‌ప్రో ఎన్‌ఎస్‌డీసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎన్ఎస్డీసీ సుమారు రూ.18 కోట్లను రుణంగా ఇస్తుంది. తద్వారా 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు వీలవుతుందని స్కిల్‌ప్రో చైర్మన్ అనంత్‌రావు ఈ సందర్భంగా తెలిపారు. దేశవ్యాప్తంగా మూడేళ్లలో 220 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 48 వేల మంది తమ కేంద్రాల్లో శిక్షణ పొందారని వివరించారు.