నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు
Published Mon, Aug 1 2016 12:43 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
కర్నూలు (కొండారెడ్డిపోర్ట్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంటు కమిటీ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2931 పాఠశాలలకు నూతన కమిటీల ఎంపికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లోని ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈనెల 29న ఆయా జాబితాలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తుది జాబితాను తయారు చేశారు. సోమవారం ఉదయం 7 నుంచి 1 గంట వరకు స్కూల్ మేనేజ్‌మెంటు కమిటీ సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఎన్నికైన సభ్యులతో చైర్మెన్, వైస్ చైర్మెన్‌ల ఎన్నికలు జరుగుతాయి. 2 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు కొత్త కమిటీ ప్రమాణం ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement